శిరీషఆత్మహత్య: కీలక ఆధారాలను సేకరించిన పోలీసులు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: బ్యూటీషీయన్ శిరీష పనిచేసే స్టూడియో యజమాని రాజీవ్ కు చెందిన ఫోర్డ్ ఎండీవర్ కారును పోలీసులు గురువారం నాడు సీజ్ చేశారు. ఈ కారులో ఏదైనా క్లూ దొరికే అవకాశం ఉందని పోలీసులు బావిస్తున్నారు.

పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, కుకునూర్ పల్లిలో ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి, శిరీష, శ్రవణ్, రాజీవ్ లు ఒకేచోట ఉన్నట్టు కీలక ఆధారాలను సేకరించారు. అయితే ఈ కేసుతో సంబంధం ఉన్న శ్రవణ్, ఆర్ జె ఫోటోగ్రఫీ స్టూడియో నిర్వహకుడు రాజీవ్ లను బుదవారం రాత్రి వరకు విచారించినట్టు డీసీపీ లింబారెడ్డి తెలిపారు.

Police seizes Rajeev's car and cctv footage of RJ studio

సాఫ్ట్ వేర్ సంస్థలో పనిచేసే తేజస్వినితో రాజీవ్ కు పరిచయమైంది. దీంతో శిరీష, తేజస్విని, రాజీవ్ మధ్య విబేధాలు తలెత్తాయని అంటున్నారు.ఈ వివాదం పరిష్కారం కోసం కుకునూర్ పల్లి వెళ్ళినట్టు ప్రచారం సాగుతోంది. ప్రభాకర్ రెడ్డి పోలీస్ క్వార్టర్ లోనే పంచాయితీ జరిగాక హైద్రాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే తిరుగు ప్రయాణంలో ఉండగానే శిరీష తాను షామీర్ పేట ప్రాంతంలో ఉన్నట్టుగా భర్తకు వాట్సాప్ ద్వారా లోకేషన్ పంపంది.

అయితే తెల్లవారుజామున స్టూడియోకు చేరుకొన్న తరువాత స్టూడియోలోనే ఆమె ఆత్మహత్య చేసుకొందని రాజీవ్ పోలీసులకు చెప్పారు. అయితే రాజీవ్ పై అనుమానం ఉందని శిరీష భర్త సతీష్ చంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్టూడియోలోని సీసీటివి కెమెరాల పుటేజీలను కూడ పోలీసులు స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు. శిరీష పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Police seized Rajeev's car and cctv footage of RJ studio on Thursday. Rajeev and Shravan enquired wednesday midnight.
Please Wait while comments are loading...