Telangana: ప్రజా భవన్ ముందు బారికేడ్లు.. ఏం జరుగుతోంది..!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రగతి భవన్ పేరును ప్రజాభవన్ గా మార్చారు. అలాగే ప్రజాభవన్ ముందు ఉన్న కంచెలను తొలగించారు. ఇది గొప్ప మార్పుగా చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు అదే ప్రజా భవన్ ముందు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో మళ్లీ కంచెలు వచ్చాయని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతోన్నాయి. రుణ మాఫీ చేయాలని బీఆర్ఎస్, రైతు సంఘాలు చలో ప్రజా భవన్ కు పిలుపు నిచ్చాయి.
ఈ నేపథ్యంలో ప్రజా భవన్ వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా భవన్ ముందు బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు చలో ప్రజా భవన్ కు రాకుండా బీఆర్ఎస్ నేతలు, రైతు సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. గతం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ రైతులకు పలు హామీలు ఇచ్చింది.

ఇందులో రూ.2 లక్షల రుణ మాఫీ, రైతు భరోసా, వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. ఆ తర్వాత కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. దీంతో రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ చేయాలని డిమాండ్ పెరిగింది. దీంతో రైతులకు రూ.2 లక్షల వరకు రుణ మాఫీ చేయాలంటే రూ.31 వేల కోట్లు అవసరం అని తేల్చారు. ఆగస్ట్ 15 లోపు రుణ మాఫీ చేస్తామని ప్రకటించారు. మూడు దశల్లో రుణ మాఫీ చేశారు.
అయితే చాలా మంది రైతులకు ఇంతవరకు రుణ మాఫీ కాలేదు. ప్రభుత్వం కేవలం రూ.18 వేల కోట్లు మాత్రమే ఇచ్చినట్లు రైతు సంఘాలు చెబుతున్నాయి. మిగతా వారికి రుణ మాఫీ చేయమంటే చేయడం లేదని.. అందుకే చలో ప్రజా భవన్ కు పిలుపునిచ్చిట్లు చెబుతన్నారు. ఇప్పటికీ అన్నదాతలకు రుణ మాఫీ చేయకుంటే కాంగ్రెస్ ను ఎవరూ కూడా నమ్మరని అంటున్నారు. కాగా రైతు భరోసా కూడా ఇవ్వడం లేదని రైతు సంఘాలు మండి పడుతున్నాయి.












Click it and Unblock the Notifications