పాత నగదు నోట్లను మార్చుకొనేందుకు వచ్చి పోలీసులకు చిక్కాడు
కుషాయిగూడలోని లక్ష్మారెడ్డి ఇంట్లో నవంబర్ 11వ, తేదిన జరిగిన భారీ దొంగతనానికి సంబందించిన దొంగను పోలీసులు పట్టుకొన్నారు. లక్ష్మారెడ్డి ఇంట్లో 11 లక్షల నగదు, బంగారాన్ని మహేష్ అనే దొంగ డోచుకొన్నాడు.
హైదరాబాద్ :పెళ్ళి జరగాల్సిన ఇంట్లో ఇంటి పెద్ద మరణించి విషాదం అలుముకొంది. ఇంటి పెద్ద అంత్యక్రియల్లో ఉండగానే , పెళ్ళి కోసం తెచ్చిన నగదు, నగలను దొంగించాడు పాత నేరస్థుడు. అతి చాకచక్యంగా పోలీసులు పాతనేరస్థుడిని పట్టుకొన్నారు. రద్దు చేసిన నగదు నోట్లే దొంగను పట్టించాయి.
కుషాయిగూడకు చెందిన సింగిరెడ్డి లక్ష్మారెడ్డి ఈ నెల 16వ, తేదిన మరణించాడు. అదే రోజు మధ్యాహ్నం ఆయన కూతురు నిశ్చితార్థం జరగాల్సి ఉంది. ఈ నిశ్చితార్థం కోసం 11 లక్షల నగదు, 20 తులాల బంగారాన్ని ఇంట్లో తెచ్చి పెట్టారు.
హఠాత్తుగా లక్ష్మారెడ్డి మరణించడంతో కుటుంబసభ్యులు భోకసముద్రంలో మునిగిపోయారు.లక్ష్మారెడ్డి అంత్యక్రియులకు కుటుంబసభ్యులు, బంధువులు వెళ్ళగా పేట్ బషీరాబాద్ కు చెందిన పాత నేరస్థుడు కాలే మహేష్ ఈ ఇంట్లోకి దూరి నగదును, నగలను దోచుకొన్నాడు.నగదును, నగలను ఎత్తుకెళ్ళే సమయంలో తాను డ్రైవర్ నని నమ్మించాడు.

బంగారం, నగదుతో పాటు సెల్ ఫోన్ ను కూడ ఎత్తుకొని పోయాడు. ఈ సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు కేసును విచారించారు.అయితే ఈ ఫోన్ ను వాడుతున్న వ్యక్తి నిజామాబాద్ జిల్లాలో ఉన్నట్టు గుర్తించారు. అయితే తనకు ఈ ఫోన్ బస్సులో దొరికిందని ఆ వ్యక్తి చెప్పాడుదీంతో కేసు మళ్ళీ మొదటికి వచ్చింది.ఏం చేయాలనే దానిపై పోలీసులు కసరత్తు ప్రారంభించారు.
రద్దైన నోట్లు పట్టించాయి.
లక్ష్మారెడ్డి ఇంట్లో దోచుకొన్న నగదు అంతా రద్దు చేసిన నగదే. ఈ నగదును మార్చుకోవడం మహేష్ కు కష్టంగా మారింది.పాత నగదును మార్చుకొంటూ పోలీసులకు చిక్కాడు. జీడిమెట్ల పోస్టాఫీసులో 80 వేల రూపాయాల నగదును మార్చుకొన్నాడు మహేష్..రెండోరోజు కూడ మరో 80 వేల రూపాయాలను మార్చుకొనేందుకు పోస్టాఫీసుకు వచ్చాడు. అనుమానం వచ్చిన పోస్టాపీసు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరపడంతో అసలు విషయం వెలుగు చూసింది.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications