ముఖ్యమంత్రికి బందోబస్తు ఉండాల్సిన పోలీసులు.. హీరో ప్రభాస్ ఇంటికెళ్లారు!

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వెళ్లనున్న మార్గంలో బందోబస్తు ఉండాల్సిన పోలీసులు టాలీవుడ్ హీరో ప్రభాస్‌ ఇంటిదారి పట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు సిబ్బందిని తీవ్రంగా మందలించారు.

ఈ ఘటన శుక్రవారం జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముఖ్యమంత్రి కెసిఆర్ మాదాపూర్‌ వైపు వెళ్తున్నట్లు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ముందస్తు సమాచారం అందింది.

Police were went to Prabhas house instead of CM's security

అయితే, ఆ మార్గంలో బందోబస్తు ఉండాల్సిన పోలీసులు నటుడు ప్రభాస్‌ ఇంటికి వెళ్లారు. ప్రభాస్‌తో ఫొటోలు దిగేందుకు అభిమానులు వస్తున్నారని తెలిసి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండానే అక్కడికి వెళ్లిపోయారు.

ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన పోలీసులు ఉన్నతాధికారులు ఆ సిబ్బందిని పిలిచి తీవ్రంగా మందలించారు. ఈ మేరకు ఘటనపై నివేదికను కోరినట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+