BJP: ఉప ఎన్నికలో ఓడినా.. తెలంగాణలో బీజేపీ బలం పెరుగుతుందా..!
రాష్ట్రంలో బీజేపీ బలం పెరుగుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2018 నుంచి ఇప్పటి వరకు కాషాయ దళం తమ బలాన్ని పెంచుకున్నట్లు చెబుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 100కు పైగా సీట్లలో పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ.. కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచింది. గోషామహల్ నుంచి రాజా సింగ్ ఒక్కడే గెలిచాడు. కానీ 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో విజయం సాధించింది బీజేపీ. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, ఆదిలాబాద్ నుంచి సోయం బాపు రావు గెలుపొందారు.

బండి సంజయ్
బండి సంజయ్ అధ్యక్షుడు అయిన తర్వాత కాషాయ దళం మరింత పుంజుకుంది. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్లు సాధించింది. ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ సత్తా చాటింది. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో కూడా పార్టీ పోటీ ఇవ్వగలిగింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఓడిపోయింది. కానీ దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచింది. గతేడాది జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికలో కాషాయ దళం విజయం సాధించింది. మునుగోడులో పార్టీ ఓడినా.. ఓట్ల శాతం మాత్రం గణనీయంగా పెంచుకుంది.

టీఆర్ఎస్
టీఆర్ఎస్ నుంచి 83 మంది ఎమ్మెల్యేలు, 14 మంది మంత్రులు,ఎమ్మెల్సీలు, ఎంపీలు, కేటీఆర్, కేసీఆర్ ప్రచారం చేసినా టీఆర్ఎస్ కు 10 వేల ఓట్లకు పైగా మెజార్టీ వచ్చంది. అంటే బీజేపీ బలం పెరిగినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇక్కడ బీజేపీని చూసు ఓటు వేయలేదని రాజగోపాల్ రెడ్డి చూసి మాత్రమే ఓటు వేశారని కొందరు అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా రాష్ట్రంలో మాత్రం బీజేపీ బలం పెరుగుతుందని తెలుస్తోంది.

కాంగ్రెస్
రాష్ట్రంలో బీజేపీ బలపడడానికి టీఆర్ఎస్సే కారణమని విశ్లేషకులు వివరిస్తున్నారు. కేసీఆర్ కాంగ్రెస్ ను బలహీనపరచడానికి హస్తం పార్టీ ఎమ్మెల్యేలను గులాబీ గూటిలో చేర్చుకున్నారు. ఇలా చేయడం వల్ల బీజేపీ బలపడిందని భావిస్తున్నారు. అయితే మునుగోడు ఎన్నికల్లో మూడో స్థానికి పరిమితమైన కాంగ్రెస్ బలం పూర్తిగా తగ్గిపోలేదని.. ఆ పార్టీకి క్యాడర్ ఉందని విశ్లేషిస్తున్నారు. హస్తం నేతల మధ్య సయోధ్య లేకపోవడం ఆ పార్టీకి శాపంగా భావిస్తున్నారు. వచ్చే సర్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ తప్పదని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications