Poonam Kaur: పూనమ్ ట్వీట్ అర్థం కావాలంటే మినిమమ్ డిగ్రీ పాస్ కావాలి..!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్రో చిత్రం కలెక్షన్ల పరంగా నిరాశపర్చింది. మొదటి రెండు రోజులు మాత్రమే కనిపించిన కలెక్షన్స్ ఆ తర్వాత తుస్సుమనిపించాయని స్వయంగా ఏపీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఇక అంబటి రాంబాబు క్యారెక్టర్‌ను పృథ్వీ చేత కావాలనే పవన్ కళ్యాణ్ చేయించాడంటూ మంత్రి ఆరోపించారు. దీంతో పవన్ కళ్యాణ్ వర్సెస్ అంబటి రాంబాబుగా బ్రో చిత్రం మారింది.
ఇక బ్రో సినిమాకు సంబంధించి ఘాటు వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు. నిర్మాత బ్లాక్ మనీ పెట్టి సినిమాను నిర్మించారని చెప్పుకొచ్చారు.పవన్ కళ్యాణ్‌కు ఇచ్చినంత రెమ్యూనరేషన్ కూడా ఈ సినిమాకు కలెక్షన్ల రూపంలో రాలేదని అంబటి సెటైర్ వేశారు. ఇదిలా ఉంటే చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ స్పందించారు.

తనకు సంస్కారం అంటూ ఒకటుందని మంత్రిలా తాను మాట్లాడలేనని చెప్పుకొచ్చాడు విశ్వప్రసాద్. అదే సమయంలో తను సినిమాకు ఎంత ఖర్చు చేసింది పవన్ కళ్యాణ్‌కు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చింది బయటకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పిన విశ్వప్రసాద్... ఏదైనా ఏజెన్సీలు తమను సంప్రదిస్తే తప్పకుండా వివరాలను అందిస్తానని వెల్లడించారు.
ఇదంతా ఇలా ఉంటే..నటి పూనమ్ కౌర్ మరోసారి పరోక్షంగా పవన్‌ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసింది. రాజకీయాలు ఎంటర్‌టెయిన్మెంట్ చుట్టూ తిరుగుతుంటే,ఎంటర్‌టెయిన్మెంట్ రాజకీయాలు చుట్టూ తిరుగుతోందంటూ ట్వీట్ చేసింది. రాజకీయాలు చాలా వినోదాత్మకంగా మారితే, ఎంటర్‌టెయిన్మెంట్ సీరియస్ సబ్జెక్ట్‌గా మారిందంటూ ట్వీట్ చేసింది పూనమ్ కౌర్.
Politics has become so entertaining ,
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) August 1, 2023
Entertainment has become so serious !!!#justthoughts
అయితే పూనమ్ చేసిన ఈ ట్వీట్‌లో ఎవరినీ ట్యాగ్ చేయలేదు. ఎవరి పేరు తీయలేదు. కానీ ఆ ట్వీట్ మాత్రం పవన్ కళ్యాణ్ వర్సెస్ అంబటి రాంబాబులను ఉద్దేశించే వేసినట్లు చూసినవారికెవరికైనా అర్థమవుతుంది.ఇక ఈ ట్వీట్‌ను చూసిన వారు చాలామంది పవన్ అభిమానులు పూనమ్ కౌర్‌ను ఓ ఆట ఆడేసుకుంటుంటే... కొందరు మాత్రం కరెక్ట్‌గా చెప్పారంటూ పూనమ్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. మొత్తానికి పూనమ్ కౌర్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు రాజకీయ చర్చగా మారింది.
-
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
దయచేసి నన్ను సినిమాల్లో పెట్టుకోండి: రాజశేఖర్ రిక్వెస్ట్ -
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
"మొన్న చెప్పి హిట్టు కొట్టా.. మళ్లీ చెప్తున్నా బంపర్ బ్లాక్ బస్టర్" -
'బైకర్' ట్రైలర్ రిలీజ్.. శర్వానంద్ ఈసారి హిట్ కొట్టేశాడోచ్..! -
'అమ్మా.. నాకు ఈ యాక్టింగ్ వద్దు!': కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్!! -
తెలంగాణ గద్దర్ అవార్డుల్లో చిన్న సినిమా హవా! -
బన్నీ మూవీలో ఐదుగురు భామలా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు












Click it and Unblock the Notifications