Revanth Reddy: సీఎం రేవంత్ తో పాప్ సింగర్.. ఎక్కడంటే..!
ప్రముఖ పాప్ సింగర్ స్మిత సోషల్ మీడియాలో ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. స్మిత సీఎం రేవంత్ తో కలిసి దిగిన ఫొటోను ఎక్స్ పోస్ట్ చేశారు. అయితే స్మిత సీఎం రేవంత్ ను ప్రత్యేకంగా కలవలేదు. రేవంత్ రెడ్డిని విమానంలో వెళ్తున్నప్పుడు కలిసినట్లు స్మిత తెలిపారు. సీఎం కలవడం ఆనందంగా ఉందన్నారు. ఆ ఫొటోతో పాటు చాలా కాలం తర్వాత ఎవరిని ఎక్కడ కలిశానో చూడండి అంటూ రాసుకొచ్చారు.
అత్యంత సాధారణ సీఎంల్లో రేవంత్ రెడ్డి ఒకరని స్మిత ప్రశంసించారు. సీఎం సాధారణ ప్రయాణికుల్లా అందరితో కిలసి కమర్షియల్ విమానంలో ప్రయాణించారని పేర్కొన్నారు. విమానంలో రేవంత్ రెడ్డి పక్కన కూర్చుని దిగిన ఫొటో అంటూ ఎక్స్ పోస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికల్లో భాగంగా పలు రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నారు. రేవంత్ ను కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా ప్రకటించింది. దీంతో ఆయన పలు రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నారు.

వివిధ రాష్ట్రాల్లోనే కాకుండా రాష్ట్రంలో కూడా రేవంత్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. శనివారం మెదక్ లో పర్యటించారు. కాగా రేవంత్ రెడ్డి సాధారణ ప్రయాణికుల్లా ప్రయాణించడంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఆడంభరాలకు వెళ్లకుండా పని చేస్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నట్లు ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ రాష్ట్రంపై రూ. లక్షల కోట్ల అప్పు ఉందని గుర్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications