సాధించేవరకు నిద్రపోరు: కెసిఆర్‌పై పోసాని, ‘ఇలాంటి సీఎంను చూడలేదు’

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై సినీ ప్రముఖులు పోసాని కృష్ణమురళీ, అలీ ప్రశంసల వర్షం కురిపించారు. హరితహారం అనే గొప్ప కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నసీఎం కెసిఆర్ కృషీవలుడని అన్నారు. ఆయన అనుకున్నది సాధించేవరకు నిద్రపోరని.. అదే ఆయన గొప్పతనమని పోసాని కొనియాడారు.

యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ మైదానంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన హరితహారం కార్యక్రమంలో పాఠశాలల విద్యార్థులకు లక్ష మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పోసాని, అలీతోపాటు సినీ నటి మన్నారా చోప్రా కూడా పాల్గొన్నారు.

హరితహారంలో పోసాని, అలీ, మన్నారా

హరితహారంలో పోసాని, అలీ, మన్నారా

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై సినీ ప్రముఖులు పోసాని కృష్ణమురళీ, అలీ ప్రశంసల వర్షం కురిపించారు.

హరితహారం

హరితహారం

హరితహారం అనే గొప్ప కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నసీఎం కెసిఆర్ కృషీవలుడని అన్నారు. ఆయన అనుకున్నది సాధించేవరకు నిద్రపోరని.. అదే ఆయన గొప్పతనమని పోసాని కొనియాడారు.

హరితహారం

హరితహారం

యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ మైదానంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన హరితహారం కార్యక్రమంలో పాఠశాలల విద్యార్థులకు లక్ష మొక్కలు పంపిణీ చేశారు.

హరితహారం

హరితహారం

ఈ కార్యక్రమంలో పోసాని, అలీతోపాటు సినీ నటి మన్నారా చోప్రా కూడా పాల్గొన్నారు.

హరితహారం

హరితహారం

ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ.. నేడు మనం నాటిన మొక్క రేపు ఎదిగితే అది సమాజానికి మేలు చేకూర్చుతుందని అన్నారు.

హరితహారం

హరితహారం

కేసీఆర్ పిలుపుమేరకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇంత గొప్పగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించటం అభినందనీ యమన్నారు.

హరితహారం

హరితహారం

నటుడు ఆలీ మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలకు సంబంధించి యాడ్స్ ఫిలింలో నటిస్తానని హామీ ఇచ్చారు.

హరితహారం

హరితహారం

సీఎం కేసీఆర్ చాలా మంచివారని, ఇటువంటి సీఎంను గతంలో చూడలేదని అన్నారు. రాష్ట్రంలో పాలన అత్యుత్తమంగా ఉందని కొనియాడారు.

హరితహారంలో

హరితహారంలో

నాడు అశోక చక్రవర్తి రహదారుల పొడవునా మొక్కలు నాటించాడని పుస్తకాల్లో చదివి తెలుసుకున్నాం. కానీ.. మన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మన కండ్లముందే కోట్ల మొక్కలు నాటించడాన్ని చూస్తున్నామని డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ అన్నారు.

హరితహారం

హరితహారం

ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు భారత మాజీ క్రికెటర్ కవల్‌జిత్ సింగ్, రహ్మత్‌నగర్ కార్పొరేటర్ ఎంఏ షఫీ, కాప్రా కార్పొరేటర్ స్వర్ణరాజ్ పాల్గొన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Actor Posani Murali Krishna and Comedian Ali along with Mannara Chopra took part in Haritha Haram plantation program organized by TRS MLA Maganti Gopinath and Deputy Mayor Fasi Uddin.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి