Lingashtakam: మంత్రి మనవడి వీడియోకు ప్రభాస్ ఫిదా
తెలంగాణ అటవీ, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ మనుమడు కొండా మురళీ కృష్ణ పటేల్ పఠించిన లింగాష్టకం వీడియోకు రెబల్ స్టార్ ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇప్పుడు భక్తి ప్రపంచంలోనే కాకుండా అభిమానుల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.
సాధారణంగా తన సినిమాలతో మాస్ ప్రేక్షకులను అలరించే ప్రభాస్... ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోకు స్వరం అందించడం ఆయనలోని మరో కోణాన్ని వెలుగులోకి తెచ్చింది. కేవలం రెండున్నరేళ్ల చిన్నారి భక్తిని గమనించి, స్వయంగా ప్రోత్సహించడం ఆయన సరళ స్వభావానికి నిదర్శనంగా అభిమానులు చెప్పుకుంటున్నారు.

Lingashtakam ముద్దుగా..
చిన్నారి లింగాష్టకం పఠనం ఎంత ముద్దుగా ఉందో, ప్రభాస్ గంభీర స్వరం ఆ వీడియోకు అంతే ఆధ్యాత్మిక గాంభీర్యాన్ని జోడించింది. ఆ స్వరం వినగానే వీడియోకి ఒక ప్రత్యేకమైన వైభవం వచ్చినట్టు అనిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కొండా మురళీ కృష్ణ పటేల్ 'లింగాష్టకం'.. వాయిస్ ఇచ్చి సర్ప్రైజ్ చేసిన ప్రభాస్.!#Prabhas #KondaSurekha #Mahashivratri2026 #Telangana #PoliticsToday #OITelugu
— oneindiatelugu (@oneindiatelugu) February 15, 2026
అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ మనుమడు కొండా మురళీ కృష్ణ పటేల్ (2.5 ఏళ్లు) భక్తితో పఠించిన లింగాష్టకం వీడియోకు హీరో ప్రభాస్… pic.twitter.com/foMdMlDPC5
"ఇలాంటి చిన్నారులే మన సంస్కృతి, సంప్రదాయాల భవిష్యత్. భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను" అంటూ ప్రభాస్ తెలిపిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రభాస్ పై ఫ్యాన్స్ ప్రశంసలు..
సినిమా రంగంలో పాన్ ఇండియా స్టార్‌గా నిలిచిన ప్రభాస్... తన స్వరంతో ఒక చిన్నారి భక్తి ప్రయాణానికి అండగా నిలవడం అభిమానుల్లో గర్వభావాన్ని కలిగిస్తోంది. హీరోగానే కాదు, విలువలను ప్రోత్సహించే వ్యక్తిగా కూడా ప్రభాస్ మరోసారి ప్రశంసలు అందుకుంటున్నారు.
ఇప్పుడీ వీడియో భక్తి, సెలబ్రిటీ మద్దతు, చిన్నారి అమాయకత్వం.. ఈ మూడింటి కలయికగా వైరల్ ట్రెండ్ అవుతోంది.












Click it and Unblock the Notifications