టీ స‌ర్కార్ పై మొన్న ప్ర‌శంస‌లు..! నేడు అసంత్రుప్తి...! ప్ర‌కాష్ రాజ్ ఎన్న ఇది..??

Recommended Video

    Telangana Elections 2018 : చంద్ర‌బాబు పై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు | Oneindia Telugu

    హైద‌రాబాద్ : ద‌క్షిణ భార‌త చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విల‌క్ష‌ణ న‌టుడుగా పేరు తెచ్చుకున్న ప్ర‌కాష్ రాజ్ ఎప్పుడూ సంచ‌ల‌నాల‌కు కేంద్ర‌బిందువ‌వుతుంటారు. సినిమా ప‌రిశ్ర‌మ‌లో ప్రాంతీయ భాషా న‌టుల‌కు అవ‌కాశాల మీద పోరాటం చేసి ఆ కొన్నాళ్ల క్రింద వివాదాస్ప‌దమైతే ఆత‌ర్వాత బీజేపి ప్ర‌భుత్వం మీద ఆరోప‌ణ‌లు చేసి జాతీయ స్థాయిలో సంచ‌ల‌నంగా మారారు ప్ర‌కాష్ రాజ్. ఏకంగా మోదీ అమ‌లు చేసిన పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్నిబ‌హాటంగా వ్య‌తిరేకించ‌డ‌మే కాకుండా ఎన్ని కోట్లు న‌ల్ల‌ధ‌నాన్ని భార‌త్ కు తిరిగి తెచ్చార‌ని కేంద్ర బీజేపి ప్ర‌భుత్వాన్ని సూటిగా ప్ర‌శ్నించి వివాదాస్ప‌దం అయ్యారు. తాజాగా బీజేపి, తెలంగాణ రాజ‌కీయాల గురించి ప్ర‌స్తావిస్తూ మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచారు.

    తెలంగాణ ప్ర‌భుత్వాన్ని మెచ్చుకున్న ప్ర‌కాష్ రాజ్..!

    తెలంగాణ ప్ర‌భుత్వాన్ని మెచ్చుకున్న ప్ర‌కాష్ రాజ్..!

    అంత‌లోనే ధ‌మ్కీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసిని న‌టుడు..!!
    తెలంగాణ రాజ‌కీయాల్లో చంద్ర‌బాబు జోక్యం ఎందుక‌ని మాట్ల‌డుతూ సంచ‌ల‌నంగా మారారు. అంతే కాకుండా త‌రుచుగా బీజేపి ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించే ప్ర‌కాష్ రాజ్ తెలంగాణ ప్ర‌భుత్వం బీజెపితో స‌న్నిహితంగా ఉంటే స‌హించేది లేదంటూ ప‌రోక్షంగా హెచ్చ‌రిక‌లు జారీ చేసారు అంతే కాకుండా టీఆర్ఎస్ పార్టీ బీజేపితో పొత్తు పెట్టుకుంటే దీక్ష‌కు పూనుకుంటారేమోన‌నే సంకేతాలు కూడా ఇస్తూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసే దిశ‌గా ప్ర‌కాష్ రాజ్కార్యాచ‌ర‌ణ ఉన్న‌ట్టు తెలుస్తోంది. తాజాగా ప్ర‌కాష్ రాజ్ చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల మ‌హాకూట‌మి నేత‌లు ఒక రకంగా స్పందిస్తుంటే అదికార గులాబీ పార్టీ నేత‌లు మ‌రోలా స్పందిస్తున్నారు.

     ఎప్పుడూ సంచలనాలకు కేంద్ర‌బిందువు ప్ర‌కాష్ రాజ్..! తాజాగా బీజేపి పైన ఘాటు వ్యాఖ్య‌లు..!!

    ఎప్పుడూ సంచలనాలకు కేంద్ర‌బిందువు ప్ర‌కాష్ రాజ్..! తాజాగా బీజేపి పైన ఘాటు వ్యాఖ్య‌లు..!!

    రాజకీయాల్లో క‌నీస ప‌రిజ్ఞానం కూడా తెలియని కొందరు మాట్లాడుతుంటే సరదాగా అనిపిస్తుంటుంది. చంద్రబాబు లాంటి వ్యక్తిని తెలంగాణ‌లో పోటీ చేయడం ఎందుకని ప్ర‌శ్నించి వివాదానికి తెర తీవ‌సారు. అలాంటి సందేహాల‌ను వ్య‌క్తం చేసిన ప్ర‌కాష్ రాజ్ కి రాజకీయ పరిజ్ఞానం ఎంతవరకున్నట్ల‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. తాజాగా ఇలాంటి విమర్శలే ఎదుర్కొంటున్నాడు ప్రకాష్ రాజ్ తెలంగాణ రాజ‌కీయాల గురించి కాస్త ఘాటు వ్యాఖ్య‌లు చేసారు.

    ఇటీవ‌ల టీడిపి రాజ‌కీయాల‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు..! తెలంగాణ‌లో బాబు జోక్యం ఎందుకంటూ ప్ర‌శ్న‌..!!

    ఇటీవ‌ల టీడిపి రాజ‌కీయాల‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు..! తెలంగాణ‌లో బాబు జోక్యం ఎందుకంటూ ప్ర‌శ్న‌..!!

    కర్ణాటక రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు, మోడీ వ్యతిరేక పార్టీలను కూడగట్టి కూటమిని నిర్మించడం వెనుక కీలక వ్యక్తి అనటంలో అతిశయోక్తి లేదు. మరోవైపు తెలంగాణలో సైతం తనదైన వ్యూహాలతో దూసుకుపోతూ ప్రత్యేకత చాటుకుంటున్నారు చంద్రబాబు. తెలంగాణలో బలమైన నేతగా పేరొందిన కేసీఆర్ కూడా బాబు వేస్తున్న స్కెచ్‌లను ఎదుర్కోవ‌డంలో అప్పుడ‌ప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటారనే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. ఎన్నిక‌ల ప్ర‌చారం తారాస్థాయిలో జ‌రుగుతూ అదికార ప్ర‌తిప‌క్షాల మ‌ద్య మాట‌ల యుద్దం నెల‌కొన్న త‌రుణంలో అటు చంద్ర‌బాబు గురించి, ఇటు బీజేపి, తెలంగాణ ప్ర‌భుత్వం గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు ప్ర‌కాష్ రాజ్.

     బీజేపి టీఆర్ఎస్ క‌ల‌యిక వ‌ద్దు..! క‌లిస్తే స‌హించ‌నంటూ వ్యాఖ్య‌లు..!!

    బీజేపి టీఆర్ఎస్ క‌ల‌యిక వ‌ద్దు..! క‌లిస్తే స‌హించ‌నంటూ వ్యాఖ్య‌లు..!!

    ఇటీవ‌లే ప్ర‌కాష్ రాజ్ తెలుగు రాజ‌కీయాల‌పై మాట్లాడారు. త‌న‌కు ప్రాంతీయ పార్టీలు ఇష్ట‌మ‌ని, ఏపీలో చంద్ర‌బాబు బాగా ప‌నిచేస్తార‌ని, తెలంగాణ‌లో కేసీఆర్ బాగా ప‌నిచేస్తార‌ని అన్నారు. తెలంగాణ‌లో తాను అయితే కేసీఆర్‌కు ఓటు వేస్తాను అన్నారు. చంద్ర‌బాబు తెలంగాణ‌కు రావాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. అలాగే తెలంగాణ‌ రాజ‌కీయాల గురించి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప‌ర్వాలేద‌ని, కాక‌పోతే ఎన్నిక‌ల నాటికి లేదా ఎన్నిక‌ల అనంత‌రం బీజేపీతో క‌లిసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేసారు. టీఆర్ఎస్ పార్టీ బీజేపితో క‌లిస్తే స‌హించేది లేదంటూనే, ఒక‌వేళ బీజేపి టీఆర్ఎస్ క‌లియిక అనివార్య‌మైతే ఆమ‌ర‌ణ దీక్ష చేప‌డ‌త‌న‌నే సంకేతాలిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వానికి హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇదే అంశాన్ని టీఆర్ఎస్ త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకునే ప్ర‌య‌త్నం చేస్తుంటే, మ‌హాకూట‌మి ప్ర‌కాష్ రాజ్ త‌మ‌కు ఓ అస్త్రం ఇచ్చిన‌ట్టు ప్ర‌చారం చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+