దరిద్రపు పాదం, ఐరన్ లెగ్, ఛీచీ నీతో పొత్తా, అంత సక్కనోడివని బెదిరిస్తున్నావా బిడ్డా: బాబుపై కేసీఆర్
వనపర్తి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వనపర్తి ప్రజా ఆశీర్వాద సభలోను తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. మొన్న నిజామాబాద్, నిన్న నల్గొండలో చంద్రబాబును టార్గెట్ చేశారు. శుక్రవారం మళ్లీ తీవ్రంగా విరుచుకుపడ్డారు.
చంద్రబాబు తొమ్మిదేళ్లు పాలమూరు జిల్లాకు దిక్కుగా ఉంటానని చెప్పాడని, కానీ ఏం చేశాడని, మన గుండెలపై గుద్దాడని కేసీఆర్ అన్నారు. ఇక్కడ వేసిన శిలాపథకాలు తీస్తే ఓ సముద్రం అవుతుందని ఎద్దేవా చేశారు. అలాంటి దుర్మార్గుడు చంద్రబాబు అన్నారు. అలాంటి టీడీపీతో కాంగ్రెస్ పార్టీ నీచాతినీచంగా పొత్తు పెట్టుకొని, చంద్రబాబును తీసుకు వస్తోందన్నారు.

అమరావతికి గులాములం అవుదామా, చంద్రబాబును తెస్తున్నారు
ఆంధ్రోళ్లకు మరోసారి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెడదామా అని కేసీఆర్ ప్రశ్నించారు. అమరావతికి గులాములం అవుదామా అన్నారు. తెలంగాణ నిర్ణయాలు తెలంగాణలో జరగాలా, ఢిల్లీలో జరగాలా అని ప్రశ్నించారు. అధికారం మన చేతిలో ఉండాలన్నారు. ఢిల్లీ లేదా విజయవాడ చేతుల్లో గులాములం కావొద్దన్నారు. ఈ పట్టు వీడితో (ఉద్యమం పట్టు) గోచీ ఊడిపోతుందన్నారు. మీ బిడ్డగా చెబుతున్నానని, ఇన్నేళ్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను గద్దలు తన్నుకుపోయేలా చూడవద్దన్నారు. చంద్రబాబును కాంగ్రెస్ నేతలు తెస్తున్నారన్నారు.

నువ్వు సక్కనోడివని బెదిరిస్తున్నారా, ఓటుకు నోటు దొంగవు కాదా
ప్రధాని నరేంద్ర మోడీ, కేసీఆర్ ఒక్కటి అయ్యారని చంద్రబాబు అంటున్నారని, నాకు ఏమి అవసరం రా బయ్!.. అని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. తనను బెదిరిస్తున్నారని చెబుతున్నాడని, నువ్వు అంత చక్కటి మనిషివి అని బెదిరిస్తున్నారా అని ప్రశ్నించారు. ఓటుకు నోటులో దొరికిన దొంగవు అన్నారు. ఆ దొంగతనంలో నీ పాత్ర లేదా నీ వాయిస్ రికార్డ్ లేదా అన్నారు. డబ్బులు ఇస్తుంటే దొరికింది నీ వ్యక్తి కాదా అన్నారు.

ఎవరిని బెదిరిస్తున్నావ్ బిడ్డా, ఛీచీ నీతో పొత్తా
ఎవరిని బెదిరిస్తున్నావు బిడ్డా అని కేసీఆర్... చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. నేను సోపతి చేద్దామని అంటే కేసీఆర్ అంగీకరించలేదని, అందుకే మహాకూటమి వచ్చిందని చెబుతున్నారని, కానీ ఇన్నేళ్లు దోచుకున్నావని, అలాంటి నీతో పొత్తా.. చంద్రబాబు.. ఛీఛీ అన్నారు. బతికుండగా నీతో కలవనని చెప్పారు. కేసీఆర్ అంగీకరించకుంటేనే మహాకూటమి ఏర్పాటు చేశామని అన్నారని, మహా కూటమా.. గూటమా.. మేం జవాబు చెబుతామన్నారు.

చంద్రబాబూ.. తేల్చుకుందామా, నీది ఐరన్ లెగ్
మీ దమ్ము, మా దమ్ము తేల్చుకుందామా అని చంద్రబాబుకు కేసీఆర్ సవాల్ విసిరారు. నీ పిట్ట బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. చంద్రబాబుది దరిద్రమైన పాదమని, ఐరన్ లెగ్ అన్నారు. ఈ రోజు ప్రారంభమైన ప్రగతి రథం ఆగదని చెప్పారు. పాలమూరులో 20 లక్షల ఎకరాలకు నీరు వచ్చి అద్భుత పాలమూరు, తెలంగాణ తెస్తామన్నారు. కాగా, అంతకుముందు సమయం అయిపోతున్న సమయంలో కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చెప్పుకుంటూ పోతే తెల్లారే దాకా నేన చెబుతానని, కానీ ఈ హెలికాప్టర్‌తో బాధ అని, మాట్లాడాలని ఉన్నా హెలికాప్టర్ బాధ ఉందని వ్యాఖ్యానించారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications