ప్రజావాణి కార్యక్రమం రేపట్నుంచి పునర్ ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో రేపటి (జూన్ 7) నుంచి ప్రజావాణి పునఃప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం లోక్ సభ ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల తాత్కాలిక వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ముగిసినందున తిరిగి ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని ప్రజావాణి ఇంచార్జీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి వెల్లడించారు.
ప్రజావాణి అర్జీల స్వీకరణ కార్యక్రమం శుక్రవారం నుంచి పునః ప్రారంభం కానున్నట్లు ప్రజావాణి ఇంచార్జీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి తెలిపారు. దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందు వల్ల ప్రజావాణి అర్జీల కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడిందని చిన్నారెడ్డి పేర్కొన్నారు.

లోక్ సభ ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో ప్రజావాణి అర్జీల స్వీకరణ కార్యక్రమం హైదరాబాద్ నగరంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో ప్రతి వారం మంగళ, శుక్ర వారాల్లో కొనసాగుతుందని చిన్నారెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా ప్రజావాణిలో అందజేయాలని చిన్నారెడ్డి కోరారు. కాగా, ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ గా రాష్ట్ర మున్సిపల్ డైరెక్టర్ దివ్య వ్యవహరిస్తున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రజలంతా తమ సమస్యలను ప్రజావాణి ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని ఆయన కోరారు. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు ఈ కార్యక్రమానికి వచ్చి ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు.












Click it and Unblock the Notifications