కెసిఆర్ నేర్పిన భాషనే: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై టిడిపి ఎమ్మెల్యే

మహబూబ్‌నగర్/ హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నేర్పిన భాషలోనే తమ పార్టీ శాసనసభహ్యుడు రేవంత్ రెడ్డి మాట్లాడారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. త్వరలో జరగనున్నగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి భంగపాటు తప్పదని ఆయన హెచ్చరించారు. గ్రేటర్ ఎన్నికలకు టీడీపీని సమాయత్తం చేస్తామని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు.

Prakash Goud defends Revanth Reddy's language

కెసిఆర్ అర్థం చేసుకుంటారని...

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత లేదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గుర్తించే పరిస్థితి రావడం బాధాకరమని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎల్ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. సోదరభావంతో మెలగాలన్న రాష్ట్రపతి సూచనను కేసీఆర్ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు ఆయన శనివారం మీడియా ప్రతినిధులో సమావేశంలో తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో మాట్లాడడానికి తాను సిద్ధమేనని ఎల్ రమణ తెలిపారు. సాగునీటి రంగంపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

టిఆర్ఎస్ పడవ బరువెక్కింది..

ఇతర పార్టీల నాయకులంతా చేరి టీఆర్‌ఎస్‌ పడవ బరువెక్కిందని, అది మునిగిపోయే ప్రమాదం ఉందని సీపీఐ నాయకుడు నారాయణ వ్యాఖ్యానించారు. అసలైన టీఆర్‌ఎస్‌ కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుందన్నారు. రాజకీయాల్లో ఉన్న వారు నిరంతరం ప్రజల మధ్య ఉండాలని, బట్ట కాల్చి ప్రజల మీద వేసి ఫాంహౌస్‌లో ఉండటం కేసీఆర్‌కే చెల్లింద ని నారాయణ విమర్శించారు. రాష్ట్రపతి కాళ్లకు మొక్కడం కాదని రాష్ట్రపతి సలహాలు పాటించాలని నారాయణ కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+