టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు ప్రకాశ్ రాజ్..!! రేసులో మరో ముగ్గురు - షెడ్యూల్ విడుదల..!!

తెలంగాణ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎన్నిక ముహూర్తం ఖరారైంది. ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. రాజ్యససభ సభ్యుడిగా ఉంటూ ఎమ్మెల్సీ అయిన బండ ప్రకాశ్ స్థానం భర్తీ కోసం ఈ ఎన్నిక జరగనుంది. అయితే, ఈ స్థానం ఇప్పుడు సీఎం కేసీఆర్ ఎవరితో భర్తీ చేస్తారనేది పార్టీలో ఆసక్తి కరంగా మారింది. ఈ ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 12 న నోటిఫికేషన్...నామినేషన్ల స్వీకరణకు 19వ తేదీ చివరి రోజుగా పేర్కొంది. 30వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సాగుతుంది. పోలింగ్ ముగిసిన తరువాత ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ స్థానంలో భర్తీ అయ్యే సభ్యుడు 2024 , ఏప్రిల్ 2వ తేదీ వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతారు.

ప్రకాశ్ రాజ్ తో భర్తీకి ఛాన్స్

ప్రకాశ్ రాజ్ తో భర్తీకి ఛాన్స్


అయితే, సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగానే బండ ప్రకాశ్ తో రాజ్యసభకు రాజీనామా చేయించి...ఎమ్మెల్సీగా ఎంపిక చేసారు. ఈ స్థానంలో ఇప్పుడు ఎస్సీ అభ్యర్ధికే ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్న క్రమంలో ఈ స్థానం నుంచి సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కు అవకాశం దక్కవచ్చని పార్టీ నేతల టాక్. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా పని చేసే సమయంలో కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ప్రకాశ్ రాజ్ మద్దతుగా నిలిచారు.

జాతీయ రాజకీయాల్లో అడుగుల్లో భాగంగా

జాతీయ రాజకీయాల్లో అడుగుల్లో భాగంగా

ముంబాయి పర్యటనలో భాగంగా మహారాష్ట్ర సీఎం వద్దకు వెళ్లిన సమయంలోనూ కేసీఆర్ తనతో పాటుగా ప్రకాశ్ రాజ్ ను తీసుకెళ్లటం..అక్కడ ప్రత్యేకంగా పరిచయం చేయటం ద్వారా ఆయనకు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రాధాన్యత లభిస్తుందనే అంచనాకు పార్టీ నేతలు వచ్చారు. ఇక, ఆయనతో పాటుగా తన జాతీయ రాజకీయాల పర్యవేక్షణ బాధ్యత కుమార్తె కవితకు ఇచ్చే విధంగా కేసీఆర్ ఆలోచనలో ఉన్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది. అందులో భాగంగా కవితను రాజ్యసభకు పంపటం ద్వారా..జాతీయ పార్టీల సమన్వయ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందనేది మరో వాదన. అదే విధంగా పార్టీ సీనియర్ నేత..బోయినపల్లి వినోద్ కుమార్‌ పేరు సైతం వినిపిస్తోంది.

పోటీలో మరో ముగ్గురు

పోటీలో మరో ముగ్గురు

గతంలో ఎంపీగా పని చేయటంతో పాటుగా.. ఢిల్లీలో జాతీయ రాజకీయాల పైన అవగాహన ఉన్న వ్యక్తి కావటంతో ఆయన్ను ఎంపిక చేసే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. ఇక..ఇదే సమయంలో బీజేపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన సీనియర్ పొలిటీషియన్ మోత్కుపల్లి నర్సింహులు సైతం రాజ్యసభ రేసులో ఉన్నారు. ఆయన్ను కొద్ది నెలల క్రితం ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తారని భావించినా..ఆయనకు కీలకమైన నామినేటెడ్ పదవి అప్పగించే ఆలోచనతో ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదనే వాదన వినిపించింది.

వచ్చే నెల మరో రెండు స్థానాలు ఖాళీ

వచ్చే నెల మరో రెండు స్థానాలు ఖాళీ


ఇక, దళితబంధు ద్వారా కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్న కేసీఆర్.. ఈ స్థానం మాత్రం ఎస్సీతోనే భర్తీ చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక, వచ్చే నెలలో మరో రెండు రాజ్యసభ స్థానాలు టీఆర్ఎస్ కు దక్కనున్నాయి. జూన్ లో డి. శ్రీనివాస్‌..కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు పదవీ కాలం పూర్తవుతుంది. దీంతో..ఇప్పుడు బండ ప్రకాశ్ స్థానంలో కేసీఆర్ ఎవరిని నియమిస్తారనేది గులాబీ పార్టీలో ఆసక్తి కర చర్చగా మారింది. దీని పైన త్వరలోనే అధికారికంగా నిర్నయం వెలువడే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+