సీటు బెల్ట్ వల్లే స్వల్ప గాయాలతో బయటపడిన హీరోయిన్ ప్రణీత
నల్గొండ: ఖమ్మం నుంచి హైదరాబాద్ వస్తూ నల్గొండ జిల్లా మోతె వద్ద హీరోయిన్ ప్రణీత వాహనం ప్రమాదానికి గురయింది. ఈ ప్రమాదంలో ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది. ఆమె సీటు బెల్టు ధరించడం వల్లే స్వల్ప గాయాలతో బయటపడిందని చెబుతున్నారు.
సంఘటన ప్రాంతంలోని వ్యక్తి ఒకరు మాట్లాడుతూ... హఠాత్తుగా ఓ ద్విచక్ర వాహనం అడ్డుగా రావడంతో ప్రమాదం జరిగిందని చెప్పారు. రహదారి కూడా సరిగా బాగా లేదన్నారు. దీంతో కారు అదుపు తప్పిందని చెప్పారు. అందరికీ చిన్న చిన్న దెబ్బలు మాత్రమే తాకాయని, నటి ప్రణీత అభిమానులు ఆందోళన చెందవద్దన్నారు.

కారు బోల్తా పడినప్పటికీ స్వల్పంగా గాయపడ్డారన్నారు. సాయంత్రం ప్రణీతను మీడియలో చూస్తారని చెప్పారు. కాగా, సీటు బెల్టు ప్రాధాన్యం మరోసారి తెలిసి వచ్చింది. కారులో ప్రయాణిస్తున్న ప్రణీత సీటు బెల్టు పెట్టుకోవడం వల్లే స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
కాగా, మోతె సమీపంలో ప్రణీత ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న ఆమె తల్లి మరో నలుగురికి స్వల్పగాయాలయ్యాయి.

ఖమ్మంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రహదారి పనులు జరుగుతున్నాయి. అక్కడి ఏఈఈలు తక్షణం స్పందించి అంబులెన్స్‌ను పిలిపించి, సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 వాహనంలో సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications