వైరల్ వీడియో: మల్లారెడ్డి కోడలు అద్దిరిపోయే డాన్స్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి మరోసారి డాన్స్ తో అదరగొట్టారు. ఫిబ్రవరి 15 మహా శివరాత్రి సందర్భంగా మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన మహా శివరాత్రి వేడుకల్లో భాగంగా ప్రీతి రెడ్డి నృత్య ప్రదర్శన చేశారు. భరతనాట్యం తో అందరినీ ఆశ్చర్య పరిచారు. సాంప్రదాయ దుస్తులు ధరించి ఆమె చేసిన భరతనాట్యం, శివ తాండవం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి చెందిన మల్లారెడ్డి యూనివర్సిటీలో మహా శివరాత్రి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి స్టేజీపై భరతనాట్యంతో అందరినీ అలరించారు. సంప్రదాయ దుస్తులు ధరించి ఆమె చేసిన భరతనాట్యం స్టెప్పులు అందరినీ ఆశ్చర్యపరిచాయి.
గతంలో మల్లారెడ్డి కాలేజ్‌లో జరిగిన ఓ ఈవెంట్ లో డాక్టర్ ప్రీతి రెడ్డి కాలా చష్మా పాటకు కాలు కదిపారు. చాలా ఈజ్ తో ఆమె చేసిన డాన్స్ వీడియో నెట్టింట వైరల్ అయింది. ప్రీతిరెడ్డి మామకు తగ్గ కోడలు అని నెటిజన్స్ కామెంట్స్ చేశారు. అలాగే అనగనగా ఒక రాజు మూవీ సాంగ్ ఈవెంట్ లోనూ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో కలిసి ఆమె డాన్స్ చేశారు. ఆ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

ఇక ప్రీతి రెడ్డి స్వస్థలం కర్ణాటక. ఆమె తల్లి సైంటిస్ట్.. తండ్రి డాక్టర్. ఈ క్రమంలోనే ప్రీతి రెడ్డి కూడా డాక్టర్ చదివారు. అలా డాక్టర్ పూర్తి చేసిన ప్రీతి రెడ్డి.. మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి తో ఆమెకు పరిచయం ఏర్పడి పెళ్లికి దారితీసింది. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వివాహం జరిగింది. ఇక ప్రస్తుతం మల్లారెడ్డి యూనివర్సిటీ డైరెక్టర్ గా ఆమె పనిచేస్తున్నారు. ఇప్పటికే మల్లారెడ్డి మెడికల్ కాలేజీలు, డెంటల్ కాలేజీలతో పాటు మల్లారెడ్డి ఉమెన్ కాలేజీలను నిర్వహిస్తున్నారు. అయితే ప్రీతి రెడ్డి విద్యార్థులకు చేసిన ఎనలేని కృషికి గాను ఆమెకు చాంపియన్ షిప్ చేంజ్ 2024 అవార్డు కూడా వరించింది.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే!












Click it and Unblock the Notifications