వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముందస్తుగా సీట్లు బ్లాక్ చేయడమా..? ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలకు హైకోర్టు మొట్టికాయ..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలకు హైకోర్టు మొట్టికాయ..! || Oneindia Telugu

హైదరాబాద్‌: ప్రయివేటు కాలేజీల కోటా వ్యవహారం పై హైకోర్ట్ కొరడా ఝుళిపించింది. కన్వీనర్‌ కోటా, యాజమాన్య కోటా, మాప్‌ అప్‌ రౌండ్‌ కింద సీట్లు భర్తీ చేసేందుకు వివిధ తేదీల్లో నిర్వహిస్తున్న కౌన్సెలింగ్‌లోని లోపాలను అడ్డంపెట్టుకుని సీట్లను బ్లాక్‌ చేసు కుంటూ ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు కోట్లు గడిస్తున్న క్రమంలో, కౌన్సెలింగ్‌ తేదీలనే మార్చేయాలంటూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఒక్క కోటా కింద కౌన్సెలింగ్‌ పూర్తయి, విద్యార్థులు కాలేజీలో చేరేందుకు నిర్ణయించే గడువు తేదీ ముగిశాకే మరో కోటా కింద కౌన్సెలింగ్‌ ప్రారంభించాలని కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది.

ప్రైవేటు మెడికల్‌ కాలేజీల దూకుడుకు హైకోర్టు బ్రేక్..! సీట్లు బ్లాక్ చేయడం పొరపాటన్న ధర్మాసనం..!!

ప్రైవేటు మెడికల్‌ కాలేజీల దూకుడుకు హైకోర్టు బ్రేక్..! సీట్లు బ్లాక్ చేయడం పొరపాటన్న ధర్మాసనం..!!

కన్వీనర్‌ కోటా కింద ఏప్రిల్‌ 1, 2 తేదీల్లో మొదటి దశ కౌన్సెలింగ్‌ నిర్వహించి, సీట్లు పొందినవారు కాలేజీలకు రిపోర్ట్‌ చేసేందుకు ఏప్రిల్‌ 8, 9 తేదీలను గడువు గా ఖరారు చేయాలంది. అప్పుడు ఏప్రిల్‌ 10 తర్వాతే యాజమాన్య కోటా కింద మొదటి దశ కౌన్సెలింగ్‌ ప్రారంభించాలని, దీంతో మొదటి దశ కౌన్సెలింగ్‌లో సీటొచ్చీ.. కాలేజీల్లో చేరని వారినే ఈ కౌన్సెలింగ్‌కు అనుమతించాలంది. కన్వీనర్‌ కోటా కింద రెండో దశ కౌన్సెలింగ్‌ తేదీలను ఏప్రిల్‌ 20, 21లుగా నిర్ణయిస్తే, ఏప్రిల్‌ 30న కాలేజీల్లో చేరేందుకు చివరి తేదీగా ఖరారు చేయాలంది.

కాలేజీల్లో చేరే గడువు ముగిసిన తర్వాతే మరో కోటా..! దేనికైనా హద్దుంటుందన్న కోర్ట్..!!

కాలేజీల్లో చేరే గడువు ముగిసిన తర్వాతే మరో కోటా..! దేనికైనా హద్దుంటుందన్న కోర్ట్..!!

మే 1 తర్వాత యాజమాన్యపు కోటా రెండో దశ కౌన్సెలింగ్‌ ప్రారంభించాలని తెలిపింది. యాజమాన్య కోటా రెండో దశ కౌన్సెలింగ్‌ పూర్తయిన తర్వాతే మాప్‌ అప్‌ రౌండ్‌ నిర్వహించాలని ఆదేశించింది. యాజమాన్యపు కోటాకు సైతం మాప్‌ అప్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించొచ్చని, కన్వీనర్‌ కోటా రెండో దశ కౌన్సెలింగ్‌ పూర్తయి, కాలేజీల్లో చేరే గడువు ముగిశాకే మాప్‌ అప్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించుకోవచ్చని తేల్చిచెప్పింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ సందర్భంగా అభ్యర్థులందరి ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తీసుకోవాలని, దీంతో ప్రైవేటు కాలేజీలు విద్యార్థులను పావులుగా వాడుకునే అవకాశం ఉండదని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, జస్టిస్‌ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.

కోటాలపేరుతో నాటకాలొద్దన్న న్యాయస్థానం..! వచ్చే యేడాదినుంచి జాగ్రత్తగా ఉండాలని హితవు..!!

కోటాలపేరుతో నాటకాలొద్దన్న న్యాయస్థానం..! వచ్చే యేడాదినుంచి జాగ్రత్తగా ఉండాలని హితవు..!!

యాజమాన్యపు కోటా కింద పలు ప్రైవేటు కాలేజీలు సీట్ల బ్లాకింగ్‌ ద్వారా అక్రమాలకు పాల్పడ్డాయని, అందువల్ల ఈ కోటా కింద జరిగిన కౌన్సెలింగ్‌ను రద్దు చేయాలని కోరుతూ కరీంనగర్‌కు చెందిన డాక్టర్‌ పి.రాజేంద్రప్రసాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖ లు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. పిటి షనర్‌ కోరిన విధం గా యాజమాన్య కోటా కింద సీట్ల భర్తీకి జరిగిన కౌన్సెలింగ్‌ను రద్దు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. అలా చేస్తే ఈ కోటా కింద సీట్లు పొందిన అనేక మంది అభ్యర్థులకు నష్టం జరుగుతుందని, అందువల్ల పిటిషనర్‌ అభ్యర్థనను ఆమోదించలేమంది.

 జరగాల్సిన నష్టం జరిగి పోయింది..! పునరావ్రత్తం చేయోద్దని ప్రయివేట్ కాలేజీలకు సూచన..!!

జరగాల్సిన నష్టం జరిగి పోయింది..! పునరావ్రత్తం చేయోద్దని ప్రయివేట్ కాలేజీలకు సూచన..!!

2018-19 విద్యా ఏడాదికి జరిగిన ప్రవేశాల్లో జరగాల్సిన నష్టం జరిగిపోయిందని, దాన్ని పూర్వ స్థితికి తీసుకురావడం సాధ్యం కాదని తెలిపింది. ప్రవేశాల తుది గడువు ముగిసినందున, పిటిషనర్‌కు వేరే కాలేజీలో ప్రవేశం కల్పించాలంటూ ఆదేశాలు జారీ చేయడం సాధ్యం కాదంది. వచ్చే విద్యా ఏడాది నుంచి అవి జరగక్కుండా ఉండేందుకు వర్సిటీ తీసుకుంటున్న పరిష్కార మార్గాలేమిటో చూడాలంది. వర్సిటీ కౌంటర్‌ను పరిశీలిస్తే, కౌన్సెలింగ్‌ తేదీల్లో ఉన్న లోపాల వల్లే సీట్ల బ్లాకింగ్‌ జరిగినట్లు అర్థమవుతుందని తెలిపింది. ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు చేయాలంటూ వర్సిటీకి సూచించింది.

English summary
The High Court scandal broke up over the quota deal of private colleges. The High Court has ordered to change the censorship dates, in order to block the shortage of counseling in various dates to block seats under management quota, proprietary quota, map-up rounds and blocking seats and private medical colleges.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X