ఆ వీడియో వైరల్ అవడంతోనే... మారుతీరావు హత్యచేశాడు: బంధువులు

ఫేస్‌బుక్‌లో ఫేస్‌బుక్‌లో అమృత పోస్ట్‌ చేసిన వీడియోనే హత్యకు ఉసిగొల్పి ఉంటుందని ప్రణయ్‌ బంధువు ఒకరు అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పెళ్లి తరువాత అమృత ఫేస్‌బుక్‌లో ఒక వీడియో పోస్ట్‌ చేసింది. ఇది చూసిన ఆమె తండ్రి మారుతీరావు నీ పెళ్లి వీడియో కంటే.. ప్రణయ్‌ను హత్య చేసిన వీడియోకే ఎక్కువ హిట్స్‌ వస్తాయంటూ అమృతను హెచ్చరించాడని ఆమె ఆరోపించారు.

మిర్యాలగూడాలో కలకలం రేపిన పరువు హత్య తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. పథకం ప్రకారం అమృత తండ్రి ప్రణయ్‌ను హత్య చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు నుంచే ప్రణయ్‌ను హత్య చేస్తాడని చెబుతూ వచ్చిన తండ్రి అన్నంత పనిచేశాడు. ప్రేమిస్తే చంపేస్తారా.. దళిత వ్యక్తిని ప్రేమించడం నేరమా అని చెప్పి అమృత వేదన చూస్తుంటే అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఇదిలా ఉంటే ఈ హత్యకు సంబంధించి అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి.

Prewedding video posted by Amrutha had led to killing of Pranay?

ఫేస్‌బుక్‌లో ఫేస్‌బుక్‌లో అమృత పోస్ట్‌ చేసిన వీడియోనే హత్యకు ఉసిగొల్పి ఉంటుందని ప్రణయ్‌ బంధువు ఒకరు అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పెళ్లి తరువాత అమృత ఫేస్‌బుక్‌లో ఒక వీడియో పోస్ట్‌ చేసింది. ఇది చూసిన ఆమె తండ్రి మారుతీరావు నీ పెళ్లి వీడియో కంటే.. ప్రణయ్‌ను హత్య చేసిన వీడియోకే ఎక్కువ హిట్స్‌ వస్తాయంటూ అమృతను హెచ్చరించాడని ఆమె ఆరోపించారు.

మొదట తాము కూడా పెళ్లికి నిరాకరించామని, అయితే ప్రణయ్‌ లేకపోతే చచ్చిపోతానని అమృత స్పష్టం చేయడంతో పెళ్లికి ఒప్పుకున్నామని ప్రణయ్‌ కుటుంబ సభ్యులు చెప్పారు. అలాగే అమృత తల్లికాబోతోందని తెలిసి ఆగస్ట్ 17న రిసెప్షన్‌​ నిర్వహించినట్టు తెలిపారు. తాము భయపడినట్టుగానే ఎంతో ధైర్యవంతుడైన తమ కొడుకుని పొట్టనపెట్టుకున్నారని కన్నీరు మున్నీరవుతున్నారు. డబ్బు, రాజకీయ పలుకుబడితో​ కిరాయి హంతకులతో ఈ పని చేయించారని ఆరోపించారు. అగ్రకుల అహంకారంతో పథకం ప్రకారం నమ్మించి, గొంతుకోసారని కులసంఘాలు ఆరోపిస్తున్నాయి. కులాంతర వివాహం చేసుకున్న కారణంగా ఈ హత్యకు పాల్పడ్డారని మండిపడుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+