భర్త, కుమారుడిని బయటకు పంపి.. వివాహితపై పూజారి అత్యాచారాయత్నం

నాచారంలోని హెచ్‌ఎంటీనగర్‌కు చెందిన ఓ వివాహితపై పురోహితుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.

హైదరాబాద్: ఓ ఇల్లాలిపై పురోహితుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని నాచారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వ్యాపారంలో నష్టాలు తొలగిపోవాలంటే తనతో పూజ చేయించుకోవాలని చెప్పిన పూజారి.. పూజ సమయంలో ఆమెపై అత్యాచారానికి యత్నించాడు.

వివరాల్లోకి వెళ్తే.. నాచారంలోని హెచ్‌ఎంటీనగర్‌కు చెందిన ఓ వివాహిత తరుచూ స్థానిక దుర్గామాత ఆలయానికి వెళ్తుండేవారు. ఈ క్రమంలో ఆలయ పురోహితుడు శ్రీరామ్‌శర్మతో ఆమెకు పరిచయమైంది. ఇటీవల తమ వ్యాపారంలో నష్టాలు పెరిగిపోయాయని పురోహితుడితో వాపోయింది. దీంతో పూజ ద్వారా దానికి పరిష్కారం లభిస్తుందని శ్రీరామ్ శర్మ నమ్మబలికాడు.

priest rape attempt on married woman in hyderabad

సెప్టెంబర్ 14న సదరు వివాహిత ఇంట్లో పూజ చేయడానికి వెళ్లాడు. ఆ సమయంలో ఆమె మాత్రమే గదిలో ఉండాలని చెప్పి.. ఆమె భర్త, కుమారుడిని బయటకు పంపించాడు. వారిద్దరూ బయటకెళ్లాక ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. దీంతో మహిళలు గట్టిగా కేకలు వేసింది. లోపలికి వచ్చిన ఆమె భర్త శ్రీరామ్ శర్మను అడ్డుకుని పోలీసులకు పట్టించారు. అతనిపై ఐపీసీ క్షన్లు 354, 420 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+