ప్రియాంక చేతికి టీ కాంగ్రెస్ పగ్గాలు - మాణిక్యం ఠాగూర్‌ అవుట్..! తాజా పరిణామాలతో..!!

కాంగ్రెస్ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందుగా ఎన్నికలు జరిగే రాష్ట్రాలపైన కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలను ప్రియాంక గాంధీకి అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలో ఎన్నికలు జరిగే కర్ణాటకతో పాటుగా తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ గా ప్రియాంకకు ప్రత్యేకంగా బాధ్యతలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.

రంగంలోకి ప్రియాంక గాంధీ

రంగంలోకి ప్రియాంక గాంధీ


వచ్చే ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి ఎన్నికల పైన కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టంది. ఇప్పటికే బీజేపీ అధినాయకత్వం తెలంగాణలో పాగా వేసేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ సైతం అప్రమత్తం అయింది. అధికారం నిలబెట్టుకొని హ్యాట్రిక్ కొట్టాలని టీఆర్ఎస్ ఆశిస్తోంది. దీంతో..తెలంగాణ ఇచ్చిన పార్టీగా అటు బీజేపీ - ఇటు టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో..స్వయంగా ప్రియాంక ను రంగంలోకి దింపుతోంది. పార్టీలో జోష్ తేవటంతో పాటుగా సమర్ధవంతంగా పార్టీని నడిపిస్తారనే నమ్మకంతో కాంగ్రెస్ లో చేరిన కొద్ది కాలానికే రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు అప్పగించారు.

తాజా పరిణామాలతో మార్పుల దిశగా

తాజా పరిణామాలతో మార్పుల దిశగా


కానీ, పార్టీలో జరుగుతున్న పరిణామాలు అధినాయకత్వానికి రుచించటం లేదు. కాంగ్రెస్ పార్టీ సొంత నేతలే రాష్ట్ర పార్టీ ఇంచార్జి మాణిక్యం ఠాగూర్‌, పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఠాగూర్‌ ఎవరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా, రేవంత్‌ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. తాజాగా.. పార్టీ నుంచి వీడిన వారు సైతం ఠాగూర్‌, రేవంత్‌లపై అనేక ఆరోపణలు చేసారు. దీంతో.. తెలంగాణలో ప్రజల్లో కాంగ్రెస్ పట్ల సానుకూలత ఉన్నా.. నేతల మధ్య పోరు సమస్యగా మారిందని అధినాయకత్వం భావిస్తోంది.

Recommended Video

    Munugodu లో Congress అభ్యర్థి విజయం నల్లేరుపై నడకే *Telangana | Telugu OneIndia
    ప్రియాంక ఎంట్రీతో జోష్ వస్తుందా

    ప్రియాంక ఎంట్రీతో జోష్ వస్తుందా


    దీంతో.. నేరుగా ప్రియాంక ఎంట్రీ ఇవ్వటం ద్వారా తిరిగి పార్టీలో జోష్ వస్తుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, కర్ణాటకలోనూ అధికారం దక్కించుకోవటం ఇప్పుడు కాంగ్రెస్ కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఇదే సమయంలో.. ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో ప్రియాంకకు బాధ్యతలు అప్పగించారు. ఫలితాలు మాత్రం నిరాశజనకంగా వచ్చిన అంశాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి సీడబ్ల్యూసీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో.. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో ప్రియాంక కు బాధ్యతల వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+