ప్రియాంక రెడ్డి హత్య : స్టేషన్‌లోనే వైద్య పరీక్షలు... మాకు అప్పగించాలని స్థానికుల డిమాండ్
ప్రియాంక రెడ్డి హత్య నిందితులకు షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లోనే వైద్యపరీక్షలు నిర్వహించారు. నిందితులను బయటకు తీసుకువెళ్లేందుకు కూడ పోలీసులకు సవాల్‌గా మారడంతో స్టేషన్‌లోనే ఉంచారు. మరోవైపు మెజీస్ట్రేట్ కూడ అందుబాటులో లేకపోవడంతో స్థానిక మండల ఎమ్మార్వో ముందు హజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. అనంతరం జిల్లా జైలుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే నిందితులను తమకు అప్పగించాలని స్టేషన్ ముందు స్థానికులు బైఠాయించారు.

స్టేషన్‌లోనే వైద్య పరీక్షలు
ప్రియాంక రెడ్డి హత్య నిందితులను షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఉంచండంతో పెద్ద ఎత్తున పోలీస్‌స్టేషన్‌ను ముందుకు ధర్న చేస్తున్నారు. స్థానికులతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన వారు స్టేషన్ ముందు బైఠాయించారు. నిందితులకు తమకు అప్పగించాలని డిమాండ్ ధర్నా చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని రాష్ట్రవ్యాప్తంగా అందోళనలు, నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించడంతో నిందితులను కనీసం ఆసుపత్రికి కూడ తీసుకెళ్లలేని పరిస్థితి. ఒక వెళ బయటకు తీసుకువస్తే లా అండ్ అర్డర్ సమస్యలు ఉత్పన్నమఅయ్యె అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ వైద్యులు స్టేషన్‌కు వచ్చి వైద్య పరీక్షలు పూర్తి చేశారు.

తహసీల్దారు ముందు నిందితులు
మరోవైపు నిందితులు నలుగురిని జిల్లా మేజిస్ట్రేట్ ముందు హజరుపరచాల్సి ఉంది. అయితే జిల్లా మేజిస్ట్రేట్ అందుబాటులో లేకపోవడంతో మండల మేజిస్ట్రేట్ అయిన తహాసీల్దార్ ముందు ప్రవేశ పెట్టనున్నారు. కాగా కేసును త్వరితగతిన విచారణ జరిపేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాల్సిందిగా పోలీసులు కోరారు. వీలైనంత త్వరగా కేసుకు సంబంధించి సాక్ష్యాలను సేకరించి, శిక్షపడే విధంగా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
Recommended Video

జిల్లా జైలుకు నిందితులు
అన్ని వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత నిందితులను స్థానిక జిల్లా జైలుకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పోలీస్‌స్టేషన్ ముందు సుమారు రెండు మూడు కిలోమీటర్ల మేర పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడినట్టు తెలుస్తోంది. దీంతో భారి బందోబస్తును ఏర్పాటు చేశారు. స్థానికులు పోలీస్ స్టేషన్‌లోపలికి వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే ఉద్రిక్తతలు తలెత్తాయి. నిందితులను అప్పగించాలంటూ యువకులు పోలీస్ స్టేషన్‌లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక షాద్‌నగర్ కోర్టుకు కూడ పెద్ద ఎత్తున చేరుకున్నారు.












Click it and Unblock the Notifications