Priyanka reddy murder:సాయంత్రం నుంచి మద్యం సేవించి, టైర్ పంక్చర్ చేసి, హెల్ప్‌చేసినట్టు నటించి...
వెటర్నరీ వైద్యురాలు ప్రియాంకరెడ్డి హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూస్తున్నాయి. ప్రియాంక సామూహిక లైంగికదాడి, హత్య పథకం ప్రకారమే జరిగిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రియాంకను అటకాయించి, సాయం చేస్తున్నట్టు నటించి దారుణానికి ఒడిగట్టారని తెలుస్తోంది.

ప్రణాళిక ప్రకారమే..
ఎప్పటిలాగే బుధవారం కూడా ప్రియాంక రెడ్డి టోల్ ప్లాజా వద్దకొచ్చారు. అక్కడ బండి పార్క్ చేసి క్యాబ్‌లో వెళ్లారు. కానీ అప్పటికే అక్కడ కీచకులు తిష్ట వేశారు. మహ్మద్ పాషా అండ్ కో.. ప్రియాంక రావడం వెళ్లడం గమనించారు. బండి పెట్టడం వల్ల.. ఆమె తిరిగొస్తుందని అనుకొన్నారు. అటు, ఇటు చూసి బండి పంక్చర్ చేశాడు. మాదాపూర్‌లో ట్రీట్‌మెంట్ చేయించుకొని తిరిగొచ్చిన ప్రియాంక.. వెనక టైర్ పంక్చరవడం చూసి షాక్ తిన్నారు.

సాయం మాటున..
అప్పటికే చీకటి పడిపోవడం.. ఇంతలో సాయం చేస్తామని మహ్మద్ పాషా అండ్ కోం వచ్చారు. వారి ప్రవర్తనపై ప్రియాంకకు అనుమానం కలిగింది. కానీ బండి పంక్చర్ కావడం వల్ల ఏమీ చేయలేకపోయింది. జరగాల్సిన దారుణం జరిగిపోయింది. కానీ నిందితులు పాషా అండ్ బృందం సాయంత్రం 5 గంటల నుంచి ఫుల్లుగా మద్యం సేవిస్తున్నట్టు తెలిసింది. మందులో ప్రియాంకను గమనించి.. ఆమె క్యాబ్‌లో వెళ్లడంతో పంక్చర్ చేశారు.

సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు
టోల్ ప్లాజా వద్దకు ప్రియాంక సాయంత్రం 4 గంటలకు వచ్చారు. అక్కడ బండి పార్క్ చేస్తామని అంటే వద్దనడతో లారీల పక్కన నిలిపివేసి.. క్యాబ్‌లో మాదాపూర్‌కు వెళ్లిపోయారు. సాయంత్రం 5 గంటల నుంచి నిందితులు మద్యం సేవిస్తున్నారు. నలుగురు నిందితులు దాదాపు 2 లీటర్ల మందు సేవించారు. రాత్రి 7 గంటలకు మాదాపూర్‌లో పని పూర్తవడంతో అక్కడినుంచి ఓఆర్ఆర్ వద్దకు క్యాబ్‌లో ప్రియాంకరెడ్డి చేరుకున్నారు. రాత్రి 9 గంటలకు ప్రియాంక వచ్చి.. తన బండిని చూడగా పంక్చర్ అయ్యింది. సమయం కోసం చూసిన నిందితులు ప్రియాంక రావడం చూసి.. సాయం చేసినట్టు నటించి లైంగికదాడి చేసి.. మట్టుబెట్టారు.

మందేసి..
ప్రియాంక వచ్చే వరికి మద్యం సేవిస్తూనే ఉన్నారు. మమూలుగా ఉంటేనే వికృతంగా ప్రవర్తించే నీచులు.. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలియలేదు. పంక్చర్ డ్రామా ఆడారు. అప్పటికే అనుమానం వచ్చిన.. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రియాంకరెడ్డి ఉండిపోయారు. ఆమె కాసింత ధైర్యం చేసి ఉంటే.. బతికి బయటపడేవారు. అక్కడే ఉండి తన ప్రాణాలమీదకు తీసుకొచ్చుకున్నారు.
Recommended Video

సాయం వెనక
నీచుల బుద్ధిని ప్రియాంక గమనించలేకపోయింది. సాయం వెనక కుటిల బుద్ది ఉందని గ్రహించలేకపోయింది. కానీ అప్పటికే ఆమెకు అనుమానం వచ్చింది. తన చెల్లికి ఫోన్ చేసి ఆ విషయాన్ని చెప్పింది. కానీ కొంచెం ధైర్యం చేయలేకపోయింది. అప్పటికే కాపుకాచిన మృగాళ్లకు చిక్కి.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.












Click it and Unblock the Notifications