తెలంగాణ అసెంబ్లీ రద్దు తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి..?
Recommended Video

గురువారం సీఎం కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొందరు గులాబీ నేతలు కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ తెలంగాణ రద్దు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది..? రద్దు చేయాలంటే పద్ధతి ఏమిటి...? రద్దు అయ్యాక ఏంజరగనుంది..? రద్దు అయ్యాక సీఎం పాత్ర ఎలా ఉండనుంది..? ఎమ్మెల్యేలంతా మాజీలవుతారా..?గవర్నర్ పాత్ర ఎలా ఉంటుంది అనేది ఒక సారి చూద్దాం.

కేబినెట్ రద్దు ఇలా అవుతుంది
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ గురువారం సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా అసెంబ్లీ రద్దుపైనే చర్చించనుంది. ఆ తర్వాత రద్దుపై ఓ నిర్ణయం తీసుకుంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 ద్వారా తెలంగాణ అసెంబ్లీ రద్దు అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శిని తమ వద్దుకు పిలిపించుకుని అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు తీర్మానం చేసిన కాపీని వారికి అందజేస్తారు. లేకపోతే సాధారణ పరిపాలన శాఖ ప్రతినిధి ద్వారా తీర్మానం ప్రతిని అసెంబ్లీ కార్యదర్శికి చేరవేస్తారు. అసెంబ్లీ కార్యదర్శికి చేరిన తర్వాత అసెంబ్లీ రద్దు చేసినట్లుగా తెలుపుతూ మరో ఫైల్ సిద్ధం చేస్తారు.
ఫైల్ సిద్ధం అయ్యాక అసెంబ్లీ స్వీకర్‌కుశాసనసభా వ్యవహారాల శాఖ మంత్రికి పంపిస్తారు. చివరికి ఆ ఫైల్ శాసనసభా నాయకుడు ముఖ్యమంత్రి వద్దకు చేరుతుంది. ఆ తర్వాత ఫైల్ గవర్నర్‌కు వెళ్తుంది. గవర్నర్ దానికి ఆమోదం తెలిపాక తిరిగి అసెంబ్లీ కార్యదర్శికి పంపిస్తారు.ఈ ప్రాసెస్ జరిగాక అసెంబ్లీ రద్దు అయినట్లు శాసనసభ కార్యదర్శి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. వెంటనే రద్దయిన సంగతి కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుపుతారు. ఇది అసెంబ్లీ రద్దు అయితే జరిగే ప్రక్రియ.

అసెంబ్లీ రద్దుకు రెండో పద్ధతి
ఇది కాకుండా మరో విధంగా కూడా రద్దు అయినట్లు కార్యదర్శి ప్రకటిస్తారు. ముందుగా అసెంబ్లీ రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానం ఆమోదించిన తర్వాత దాని ప్రతిని ముఖ్యమంత్రి నేరుగా గవర్నర్‌కు కూడా సమర్పించవచ్చు. అలాంటి సందర్భంలోనూ.. గవర్నర్ తనకు అసెంబ్లీ రద్దుపై అందిన కేబినెట్ తీర్మానం ప్రతిని శాసనసభ కార్యదర్శి వద్దకే పంపిస్తారు. ఆయన ఫైల్ సిద్ధంచేసి అసెంబ్లీ స్పీకర్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ఆమోదంతో ముఖ్యమంత్రికి పంపిస్తారు. సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక ఆ ఫైల్ గవర్నర్ వద్దకు చేరుతుంది. గవర్నర్ ఆమోదం పొందాక తిరిగి ఫైల్ అసెంబ్లీ కార్యదర్శి వద్దకు చేరుతుంది. అప్పుడు అసెంబ్లీ రద్దు అయినట్లు కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేసి, కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం పంపిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌పై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుంది.

అసెంబ్లీ రద్దు అయ్యాక ఏం జరుగుతుంది
అసెంబ్లీ రద్దు తర్వాత అధికారిక ప్రభుత్వం ఉండదు. కేవలం ఆపధ్మర్మ ప్రభుత్వం మాత్రమే ఉంటుంది. అసెంబ్లీకి ఎన్నికైన అన్ని రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలు మాజీగా మారుతారు. ముఖ్యమంతి ఆపధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరించాలని గవర్నర్ కోరుతారు. ఇది పూర్తిగా ప్రభుత్వం తిరిగి ఎన్నికయ్యేవరకు ప్రస్తుత ముఖ్యమంత్రి మంత్రులు ఆపధర్మ ముఖ్యమంత్రి మంత్రులుగా వ్యవహరిస్తారు. ఇక ప్రభుత్వం రద్దుకు ముందు తీసుకున్న నిర్ణయాలపై ఎలాంటి ఎఫెక్ట్ పడదు. కానీ రద్దు తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే...గవర్నర్ ఓకే చెబితేనే అది అమలు అవుతుంది.

కొంగరకలాన్ సభకు ముందే అసెంబ్లీ రద్దు అన్న వార్తలు
రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో జరిగిన టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభకంటే ముందు అసెంబ్లీ రద్దు అవుతుందన్న వార్తలు గుప్పుమన్నాయి. సభకు ముందు రద్దుపై కేబినెట్ తీర్మానం చేస్తుందని మీడియాతో సహా చాలా మంది బావించారు. కానీ కేబినెట్ మీట్ అయితే జరిగింది కానీ అసెంబ్లీ రద్దుపై ఎలాంటి నిర్ణయం జరగలేదు. ఆ తర్వాత అంటే సభ ముగిశాక మరోమారు కేబినెట్ భేటీ అయినప్పుడు అసెంబ్లీ రద్దుపై చర్చించినట్లు సమాచారం.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ












Click it and Unblock the Notifications