Seethakka: ఎమ్మెల్యే సీతక్క కథతో సినిమా.. అదిరిపోయే ఐడియా అన్న బండ్ల గణేష్..!
సీతక్క.. పరిచయం అక్కర్లేని ప్రజాప్రతినిధి. కరోనా సమయంలో అడవి బిడ్డలకు అండగా నిలిచిన ఆడబిడ్డ. సీతక్క చిన్న వయస్సులోనే పోరుబాట పట్టిన వీరవనిత. పీడిత వర్గాల కోసం గన్ పట్టిన బెబ్బులి సీతక్క. అయితే సీతక్క అసలు పేరు ధనసరి అనసూయ. ఆమె అడవిలోకి వెళ్లిన తర్వాత సీతక్కగా మారారు. ఆ తర్వాత ప్రజా జీవనంలోకి వచ్చిన ఆమె రాజకీయ ప్రవేశం చేశారు. ములుగు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ రోజు ఆమె పుట్టిన రోజు. సీతక్క పుట్టిన రోజు సందర్భంగా అనేక మంది ప్రముఖులు శుభకాంక్షలు తెలిపారు.
ములుగు ఎమ్మెల్యే, నా సోదరి @seethakkaMLA కు జన్మదిన శుభాకాంక్షలు. ప్రజల ఆశీర్వాదంతో మీరు నిండు నూరేళ్లూ ఆనంద ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను. pic.twitter.com/845w6eRbHK
— N Chandrababu Naidu (@ncbn) July 9, 2023
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీతక్కకు పుట్టిన రోజు శుభకాంక్షలు తెలిపారు. "ములుగు ఎమ్మెల్యే, నా సోదరి సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు. ప్రజల ఆశీర్వాదంతో మీరు నిండు నూరేళ్లూ ఆనంద ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను" అని చంద్రబాబు ట్వీట్ చేశారు. పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా సీతక్కకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. " నా సోదరి ఎమ్మెల్యే సీతక్కకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఇలాగే ముందుకెళ్తూ తెలంగాణ, దేశానికి సేవ చేయాలి" అని ట్వీట్ చేశారు.

సీతక్క జన్మదినం సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. "నమ్ముకున్న ప్రజల కోసం.. అహర్నిశలు శ్రమిస్తున్న ఎమ్మెల్యే సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు" అని బండ్ల ట్వీట్ చేశారు. బండ్ల ట్వీట్ కు నెటిజన్ స్పందించాడు. అడవిలో అన్న, లీడర్ సినిమాలి కలిపితే నిజ జీవితంలో సీతక్క సినిమా అవుతుందని.. మీరు తప్పకుండా సినిమా తీయాలని కామెంట్ చేశాడు. దీనికి వెంటనే స్పందించిన బండ్ల అద్భుతమైన సలహా తమ్ముడు.. తప్పకుండ ఆలోచిస్తా అంటూ రీప్లే ఇచ్చాడు.
I wish my sister @seethakkaMLA a very happy birthday and a great year ahead.
— Revanth Reddy (@revanth_anumula) July 9, 2023
Looking forward to work together for the betterment of the people of Telangana & serve the country. pic.twitter.com/bHbF4LZVIx
సీతక్కకు ప్రముఖలే కాదు సాధారణ ప్రజలు కూడా సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. కరోనా సమయంలో సీతక్క అడవుల్లో చేసిన సేవలకు సంబంధించి వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఎమ్మెల్యే సీతక్క ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. తానా సభల కోసం సీతక్క అమెరికా వెళ్లారు.












Click it and Unblock the Notifications