మసాజ్ సెంటర్ పెట్టిస్తానని యువతిపై ప్రొఫెసర్ లైంగిక దాడికి యత్నం
హైదరాబాద్: తన ఇంట్లో పనిచేస్తే, మసాజ్ సెంటర్ పెట్టిస్తానని, ఆర్థికంగా ఏ విధమైన ఇబ్బంది ఉండదని ఓ యువతికి మాయమాటలు చెప్పి ఓ ప్రొఫెసర్ పనికి కుదుర్చుకున్నాడు. అతని మాటలను విశ్వసించి ఆమె ఇంటి పనిలో చేరింది. ఆ క్రమంలో శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి యువతిపై ప్రొఫెసర్ లైంగిక దాడికి ప్రయత్నించాడు.
తనపై లైంగిక దాడికి ప్రయత్నించిన ప్రొఫెసర్‌పై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని పప్పులగూడలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇంట్లోకి దూసుకెళ్లిన సఫారీ
హైదరాబాదు నగరంలోని తుకారాం గేటు వద్ద టాటా సఫారీ బీభత్సం సృష్టించింది. శనివారం ఉదయం ఓ ఇంట్లోకి సపారీ దూసుకెళ్లడంతో మూడు బైక్‌లు ధ్వంసమయ్యాయి. ఇల్లు పాక్షికంగా దెబ్బ తింది. ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. దీంతో ప్రాణ నష్టం సంభవించలేదు.












Click it and Unblock the Notifications