కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ సభ్యత్వం రద్దు: జానా సహా 11 మంది సస్పెన్షన్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్‌పై దాడి వ్యవహారానికి సంబంధించి స్పీకర్ మధునూదనాచారి తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. దాడికి బాధ్యులని భావిస్తూ కాంగ్రెసు శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ సభ్యత్వాలను రద్దు చేయాలని శాసనసభ నిర్ణయించింది.

  కోమటిరెడ్డి హెడ్‌సెట్‌ విసురుతున్న దృశ్యాలు , సభ్యత్వం రద్దు?

  కాంగ్రెసు శాసనసభా పక్ష నేత జానారెడ్డి తదితర కాంగ్రెసు సభ్యులపై శాసనసభ నుంచి ఈ సమావేశాల వరకు సస్పెండ్ చేశారు. శాసనసభా వ్యవహారాల మంత్రి హరీష్ రావు తీర్మానాలను ప్రతిపాదించగా సభ ఆమోదించింది.

  సస్పెండ్ చేసిన తర్వాత కాంగ్రెసు సభ్యులు సభలోనే ఉన్నారు. దీంతో సభ నుంచి వెళ్లిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. బహిష్కరణకు, సస్పెన్షన్‌కు గురైన సభ్యులు వెళ్లిపోవాలని ఆయన సూచింంచారు. నిన్న (సోమవారం) జరిగిన ఘటన దుర్మార్గమైందని అన్నారు.

   స్పీకర్ ఆవేదన, హరీష్ రావు తీర్మానం

  స్పీకర్ ఆవేదన, హరీష్ రావు తీర్మానం

  మంగళవారం శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే నిన్నటి ఘటనపై స్పీకర్ మధుసూదనాచారి ఓ ప్రకటన చేశారు. ఆ ఘటన తనను తీవ్రమైన మనస్తాపానికి గురి చేసిందని అన్నారు. సంఘటన దురదృష్టకరమని అన్నారు. ఆ తర్వాత హరీష్ రావు తీర్మానాలను ప్రతిపాదించారు.

   11 మంది కాంగ్రెసు ఎమ్మెల్యేల సస్పెన్షన్

  11 మంది కాంగ్రెసు ఎమ్మెల్యేల సస్పెన్షన్

  కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) నేత కె. జానా రెడ్డి సహా 11 మంది కాంగ్రెసు ఎమ్మెల్యేలను స్పీకర్ ఈ సభా సమావేశాల వరకు సస్పెండ్ చేశారు. జీవన్ రెడ్డి, డికె అరుణ, వంశీచందర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డి, మాధవరెడ్డి, చిన్నారెడ్డి, గీతారెడ్డి, మల్లుభట్టి విక్రమార్క, పద్మావతి, రామ్మోహన్ రెడ్డి ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్‌కు గురయ్యారు.

  ఇద్దరి శాసనసభ సభ్యత్వం రద్దు

  ఇద్దరి శాసనసభ సభ్యత్వం రద్దు

  కాంగ్రెసు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ శాసనసభా సభ్యత్వాలను రద్దు చేయాలని శానససభ నిర్ణయించింది. స్వామి గౌడ్‌పై వారిద్దరు దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కున్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కాంగ్రెసు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

   ఇద్దరు మండలి సభ్యుల సస్పెన్షన్

  ఇద్దరు మండలి సభ్యుల సస్పెన్షన్

  కాంగ్రెసు శాసనసమండలి సభ్యులు కోమటిరెడ్డి వెంకటెర్డి, ఆకుల లలితలపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు శాసన మండలిలో డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి తీర్మానం ప్రతిపాదించారు. స్వామి గౌడ్ స్థానంలో మండలి సమావేశాలకు నేతి విద్యాసాగర్ రావు అధ్యక్షత వహించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Telangana assembly has passed resolution to cancel the membership of Congress MLAs Komatireddy Venkat Reddy and sampath. 11 Congress MLs ssuspended from ssembly.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి