ఆన్‌లైన్‌ వ్యభిచార ముఠా గుట్టు రట్టు, పేదింటి యువతులతో వ్యభిచారం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఆన్‌లైన్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరిని హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.పథకం ప్రకారంగా పోలీసులు ఈ ముఠా గుట్టును రట్టు చేశారు. పేద కుటుంబాల యువతులను, మహిళలను వ్యభిచారంలో దించుతున్నారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఈ ఇద్దరు ముఠాగా ఏర్పడి విటులకు అమ్మాయిలను సరఫరా చేస్తున్నారు.

ఆన్‌లైన్ ద్వారా వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న ముఠాను సీసీఎస్ పోలీసులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లాకు చెందిన సతీష్‌గౌడ్ హైద్రాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరిలో నివాసం ఉంటున్నాడు. సులభంగా డబ్బులు సంపాదించేందుకుగాను ఆన్‌లైన్‌లో వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నాడరు. ఖమ్మం నుండి హైద్రాబాద్‌కు వచ్చిన నాగ కార్తీక్ సహయంతో ఈ ముఠాను కొంతకాలంగా నిర్వహిస్తున్నాడు.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు చెందిన మహిళలు, యువతులకు గాలం వేసి వ్యభిచారంలోకి ఈ ముఠా దింపుతోంది అసభ్యకరమైన , ఫోటోలతో ఆన్‌లైన్‌లో ప్రకటనలు ఇస్తున్నారు. యువతులు కావాలంటే సంప్రదించాలని తమ నెంబర్లను ఆన్‌లైన్‌లో ఇచ్చారు.

Prostitution racket busted in Hyderabad; two arrested

సైబర్‌క్రైమ్ పోలీసులు ఈ ప్రకటనను ఇటీవలనే గుర్తించారు. ఈ మేరకు రూ.3 వేలు తీసుకొని వెంకటగిరికి రావాలని నిందితుడు పోలీసులకు చెప్పాడు. విటుల మాదిరిగా పోలీసులు సతీష్ వద్దకు వెళ్ళి బేరం కుదుర్చుకొన్నాడు.

బేరం కుదుర్చుకొన్న తర్వాత పోలీసులు సతీష్ ఇంట్లోకి వెళ్ళి అక్కడే ఉన్న నాగ కార్తీక్‌ను కూడ అదుపులోకి తీసుకొన్నారు. సతీష్ ఇంట్లో ఉన్న మరో యువతికి విముక్తిని కల్పించారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A prostitution racket was busted in Hyderabad with the arrest of two persons. Satish goud and Naga karthik were arrested for running online sex racket in Hyderabad.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి