హైదరాబాద్‌లో మరో వ్యభిచార ముఠా గుట్టు రట్టు... ముగ్గురి అరెస్ట్...

హైదరాబాద్‌లో మరో వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. చిక్కడపల్లిలోని ఓ హోటల్లో వ్యభిచార దందా నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాతో సంబంధం ఉన్న మరికొందరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

పోలీసుల కథనం ప్రకారం... సూర్యాపేటకు చెందిన చెందిన ఉష శ్రీ(22) కొందరు వ్యక్తులతో కలిసి సులువుగా డబ్బు సంపాదించేందుకు వ్యభిచార దందా మొదలుపెట్టింది. చిక్కడపల్లిలోని ఓ హోటల్లో గదిని అద్దెకు తీసుకుని వివిధ ప్రాంతాల నుంచి యువతులను,విటులను ఇక్కడికి రప్పించేది. విటుల నుంచి తీసుకునే డబ్బులో అమ్మాయిలకు కొంత ఇచ్చి తాను కొంత తీసుకునేది.

prostitution racket busted in chikkadapally hyderabad

హోటల్లో హౌస్ కీపింగ్ జాబ్ చేస్తున్న శ్రీకాంత్,సాయికుమార్‌ అనే ఇద్దరు యువకులు ఆమెకు సహకరించేవారు. ఇదే క్రమంలో ఈ వ్యభిచార దందాపై ఇటీవల పోలీసులకు సమాచారం అందింది. దీంతో హోటల్‌పై నిఘా పెట్టిన పోలీసులు శుక్రవారం(జులై 16) రాత్రి అకస్మాత్తుగా దాడులు చేశారు. ఈ సందర్భంగా ఉషశ్రీ,శ్రీకాంత్,సాయి కుమార్‌లను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. వారి నుంచి మూడు సెల్‌ఫోన్లు రూ.8 వేలు నగదు,10 కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాతో సంబంధం ఉన్న విష్ణు,ధర్మా అనే మరో ఇద్దరు వ్యక్తులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

రెండు వారాల క్రితం సోమాజిగూడ రాజ్‌భవన్ రోడ్‌లోని ఓ హోటల్లోనూ వ్యభిచారం ముఠా పట్టుబడింది.హోటల్లోని రెండు గదుల్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు... ఇద్దరు నిర్వాహకులు,ఏడుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు.ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి వారితో వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియా వేదికగా యువతుల ఫోటోలతో విటులను ఆకర్షించి ఈ దందా నడుపుతున్నారు.

రెండు నెలల క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నం.41లోని ఓ హోటల్‌లోనూ వ్యభిచార ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. హోటల్‌పై దాడులు చేసి ముగ్గురు సెక్స్ వర్కర్లు,ఇద్దరు విటులు,ఒక నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు. నగరంలో ఇలా వరుసగా వ్యభిచార దందా ముఠాలను పోలీసులు బట్టబయలు చేస్తున్నా.. ఎప్పటికప్పుడు కొత్త ముఠాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+