సెక్స్ రాకెట్ గుట్టురట్టు: నిర్వాహకురాలితోపాటు యువతి, విటుల అరెస్ట్

కరీంనగర్‌: నగరంర్‌లోని కోతిరాంపూర్‌లో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు. నిర్వాహకురాలితోపాటు ఓ యువతి, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు.

టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల వివరాల ప్రకారం.. కోతిరాంపూర్‌లోని కాళిదాసు అనసూర్య కొన్నేళ్లుగా ఇతర జిల్లాల నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తోంది.
సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆ ఇంటిపై నిఘా ఏర్పాటు చేశారు.

Prostitution Racket busted by Police in Karimnagar city

బుధవారం వరంగల్‌ అర్బన్‌ జిల్లా హసన్‌పర్తికి చెందిన యువతితోపాటు ఎల్‌ఎండీ కాలనీలోని ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎం.డి నవీద్‌ఖాన్‌, కరీంనగర్‌లోని షాషామహెలకు చెందిన ఇమ్రాన్‌ ఖాన్‌, నిర్వాహకురాలు అనసూర్యలను అదుపులోకి తీసుకున్నారు.

ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్‌ సీఐ గౌస్‌బాబా, ఎస్సైలు కిరణ్‌, సంతోష్‌, నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో నిందితులను అప్పగించగా.. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+