సెక్స్ రాకెట్ గుట్టురట్టు: హోటల్ మారియట్‌లో అమ్మాయిలు!

హైదరాబాద్‌: నగర శివార్లలో మరో సెక్స్‌ రాకెట్ గుట్టు రట్టయ్యింది. ఉప్పర్‌పల్లిలోని హ్యాపీ హోమ్స్ కాలనీలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిర్వాహకులు, విటులు అరెస్ట్..

నిర్వాహకులు, విటులు అరెస్ట్..

నిర్వాహకులతో పాటు ముగ్గురు విటులను కటకటాల వెనక్కి నెట్టారు. పాతబస్తీకి చెందిన నిషా ఖాన్ అనే మహిళను ముఠా లీడర్‌గా గుర్తించారు. గతంలో పలుమార్లు వ్యభిచార కేసుల్లో పట్టుబడిన నిషాఖాన్.. పలువురు బాలికలతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తోంది.

బాధ భరించలేని బాలిక..

బాధ భరించలేని బాలిక..

కాగా, ఆ బాధను భరించలేక ఓ బాలిక.. ఆ నరకకూపం నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ సెక్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టయింది. నిర్వాహకురాలు నిషాఖాన్‌తో పాటు ఆమెకు సహకరించిన పహాడీ షరీఫ్‌కు చెందిన తహసీన్ ఫాతిమా , సభా అనే మరో ఇద్దరు మహిళలను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి.. బాలికలను ఈ నరకకూపంలోకి దింపుతున్నట్లు తెలిసింది.

టాస్క్‌ఫోర్స్‌ దాడి: హోటల్ మారియట్‌లో పేకాట

టాస్క్‌ఫోర్స్‌ దాడి: హోటల్ మారియట్‌లో పేకాట

మరోవైపు హైదరాబాద్ నగరంలో ట్యాంక్‌బండ్‌ వద్ద ఉన్న ఓ హోటల్‌పై శుక్రవారం రోజు తెల్లవారుజామున టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు జరిపారు. పేకాడుతున్నారన్న సమాచారంతో దాడులు జరిపి 40మంది వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి భారీ మొత్తంలో నగదు, విదేశీ మద్యం, హుక్కాను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్‌ అయినవారిలో బడా వ్యాపారవేత్తలు ఉన్నారు. మూడు రోజుల నుంచి హోటల్‌లో మకాం వేసి పేకాడుతున్నట్లు తెలుస్తోంది. కాగా కీలక సూత్రధారులైన సంజయ్‌ కుమార్‌, ప్రవీణ్‌ పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

అమ్మాయిలు కూడా!

అమ్మాయిలు కూడా!

కాగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో సంపన్న వర్గాలకు చెందిన అమ్మాయిలు కూడా ఉండటంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. వ్యభిచారమా? రేవ్ పార్టీనా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. దీపావళి సందర్భంగా పార్టీ పేరుతో మత్తులో జోగుతూ హంగామా చేసినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+