స్పా పేరిట వ్యభిచారం: విటులు, యువతుల అరెస్ట్
హైదరాబాద్: నగరంలో మరో వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. మసాజ్, బ్యుటీషియన్ పేర్లతో గుట్టచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారం మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులకు అందింది.

వెంటనే స్పందించిన పోలీసులు శేరిలింగంపల్లిలోని స్పా సెంటర్లలో బుధవారం తనిఖీలు చేపట్టగా ఈ విషయం బట్టబయలైంది. స్పా పేరిట అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్న నలుగురు విటులు, యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం విచారణ కోసం వారిని చందానగర్ పోలీసులకు అప్పగించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications