వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్ రెడ్డి కి భ‌ద్ర‌త క‌ల్పించండి..! హైకోర్ట్ కీల‌క ఆదేశాలు..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : తనను అంతమొందించడానికి కుట్ర జరుగుతోందని, నిరంతరం తన వెంట నలుగురు భద్రతాసిబ్బంది ఉండేలా.. తనకు భద్రత కల్పించాలని టీపీసిసి కార్య‌నిర్వాహ‌క అద్య‌క్షుడు రేవంత్‌ రెడ్డి గతంలో హైకోర్టును విన్నవించారు. నిజానిజాలు తెలుసుకొని దీనిపై సుదీర్ఘ వాదనల అనంతరం కేంద్రం భద్రత కల్పించాలని పేర్కొంటూ సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. అయినా తనను పట్టించుకోవటం లేదని రేవంత్‌రెడ్డి గురువారం ఆరోపించారు. కేంద్ర భద్రతా సిబ్బందితో తనకు సెక్యూరిటీ ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం చెప్పినా, ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డికి 4 ప్లస్ 4 భద్రత కల్పించండి..! ప్ర‌భుత్వానికి హైకోర్టు ఆదేశం..!!

రేవంత్ రెడ్డికి 4 ప్లస్ 4 భద్రత కల్పించండి..! ప్ర‌భుత్వానికి హైకోర్టు ఆదేశం..!!

తెలంగాణ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారిన కాంగ్రెస్ క‌మిటీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ రేవంత్ రెడ్డికి అనుకూలంగా న్యాయ‌స్థానం తీర్పునిచ్చింది. త‌న‌కు శ‌త్రువుల నుండి ముప్పు పొంచి ఉంద‌ని, అద‌న‌పు భ‌ద్ర‌తా సిబ్బంది కావాల‌ని గ‌తంలో ఆయ‌న కేంద్ర హోం శాఖ‌కు పెట్టుకున్న విజ్ఞ‌ప్తికి సానుకూల స్పంద‌న వ‌చ్చింది. రేవంత్ రెడ్డి భ‌ద్ర‌త గురించి హైకోర్ట్ లో విన్న‌వించిన విజ్ఞ‌ప్తికి న్యాయ‌స్థానం స్పందించింది. రేవంత్ రెడ్డికి అద‌న‌పు భ‌ద్ర‌త‌ను ఇవ్వాల‌ని కోర్టు అదేశాలు జారీ చేసింది.

హూం శాఖ అప్పీలును అంగీక‌రించిన కోర్ట్..! ఎన్నిక‌ల ఫ‌లితాల వ‌ర‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని ఆదేశం..!

హూం శాఖ అప్పీలును అంగీక‌రించిన కోర్ట్..! ఎన్నిక‌ల ఫ‌లితాల వ‌ర‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని ఆదేశం..!

ఎట్ట‌కేల‌కు రేవంత్ రెడ్డి త‌న భ‌ద్ర‌త విశ‌యంలో చేస్తున్న పోరాటానికి ఫ‌లితం ద‌క్కిన‌ట్టు తెలుస్తోంది. తెలంగాణ‌లో రాజ‌కీయంగా అదికార పార్టీకి ఏకుమేకైన రేవంత్ రెడ్డికి ప్ర‌మాదం ఎటునుంచి వ‌స్తుందో తెలియ‌ని ప‌రిస్థితులు త‌లెత్తాయ‌ని గ‌తంలో ఆయ‌న ఎన్నోసార్లు కేంద్ర హోంశాఖ‌కు మొర‌పెట్టుకున్నారు. దానిపై ఆచితూచి స్పందించిన హోశాఖ ఎట్ట‌కేల‌కు హోకోర్టు లో విజ్ఞ‌ప్తి చేసిన విశ‌యం తెలిసిందే. తాజాగా త‌న‌ను హ‌త‌మార్చేందుకు కుట్ర జ‌రుగుతోందిని రేవంత్ రెడ్డి త‌న ప్ర‌చార‌న్ని కూడా వాయాదా వేసుకున్నారు. భ‌ద్ర‌త పెంపు ఆదేశాల‌తో రేవంత్ రెడ్డి మ‌ళ్లీ ప్ర‌చారంలో పాల్గొంటార‌నే అవ‌కాశాలు ఉన్న‌ట్టు తెలుస్తోంది.

త‌న‌కు ముప్పు ఉందని ప‌లు సార్లు కేంద్రానికి విన్న‌వించుకున్న రేవంత్..!

త‌న‌కు ముప్పు ఉందని ప‌లు సార్లు కేంద్రానికి విన్న‌వించుకున్న రేవంత్..!

తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భద్రతకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రేవంత్ కి భద్రత కల్పించాలంటూ ఇప్పటికే ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని కేంద్రం చేసిన అప్పీల్ ని హైకోర్టు అంగీకరించింది. రేవంత్‌రెడ్డి భద్రత అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని తేల్చిచెబుతూ ఈ మేరకు 4 ప్లస్ 4 భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యేంత వరకూ ఈ భద్రతను కొనసాగించాలని సదరు ఉత్తర్వుల్లో హైకోర్టు పేర్కొంది.

ఎట్ట‌కేల‌కు రేవంత్ రెడ్డికి ఊర‌ట‌..! భ‌ద్ర‌త విష‌యంలో సానుకూల నిర్ణ‌యం..!

ఎట్ట‌కేల‌కు రేవంత్ రెడ్డికి ఊర‌ట‌..! భ‌ద్ర‌త విష‌యంలో సానుకూల నిర్ణ‌యం..!

దీనిపై తాజాగా కేంద్ర హోంశాఖ హైకోర్టులో అప్పీల్‌ చేసింది. స్థానిక నేతల భద్రత అనేది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతనే అని, రేవంత్‌కు కేంద్రం భద్రత కల్పించాలన్న సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సవరించాలని కోరింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పును వెలువరించింది. రేవంత్‌రెడ్డికి భద్రతను రాష్ట్ర ప్రభుత్వమే కల్పించాలని ఆదేశించింది. 4 ప్లస్ 4 భద్రతతోపాటుగా ఆయనకు ఎస్కార్ట్‌ ను ఇవ్వాలని పేర్కొంది. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే వరకు ఆయన ఈ భద్రత కలిపించాలని చెప్పింది హైకోర్టు.

English summary
The conspiracy is going to end him, to keep his security along with him constantly. TPCC working president Revanth Reddy had previously asked the High Court to give him security. The single judge's order was issued by the Center to ensure the safety of the Center after the long arguments of the truth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X