TS Polls":తెలంగాణలో కాంగ్రెస్ "సత్తా",గెలిచే సీట్లివే - తాజా అంచనాలతో జోష్..!!
తెలంగాణ ఎన్నికల్లో గెలిచేదెవరు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధిస్తుందా. కాంగ్రెస్ సంచలనం నమోదు చేయబోతోందా. బీజేపీ స్థానం ఏంటి. ఇప్పుడు దేశం మొత్తం తెలంగాణ వైపే చూస్తోంది. ఈ సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ కు అనుకూలంగా పలు సర్వేలు బయటకు వస్తున్నాయి. చివరి వరకు ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేది కాంగ్రెస్ వ్యూహం. ఇక,ఎన్నికల్లో గెలుపు అంచనాలపై తమ అంచనాలను వెల్లడించే సత్తా మార్కెట్ తెలంగాణ పైన వెల్లడించిన లెక్కలను సెఫాలజిస్టులు విశ్లేషిస్తున్నారు.
హోరా హోరీ పోరు : తెలంగాణలో ఎన్నికల పోరు యుద్దాన్ని తలపిస్తోంది. కాంగ్రెస్ కు అనుకూల వాతావరణం ఉందనే విశ్లేషణలు ఉన్నాయి. బీఆర్ఎస్ తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తోంది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనా వైఫల్యాలు..కేసీఆర్ వ్యవహార శైలి..కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయారని..కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. హోరా హోరీ పోరు ఖాయమనే అంచనాలు ఉన్నా.. కాంగ్రెస్ కు అనుకూల వాతావరణం కనిపిస్తోందని సెఫాలజిస్టులు చెబుతున్నారు.ఎన్నికల సమయంలో గెలుపు అంచనాలతో బెట్టింగ్ లు నిర్వహించే సత్తా మార్కెట్ తెలంగాణలో తమ అంచనాలను బయట పెట్టిందంటూ..సెఫాలజిస్ట్ పార్ధాదాస్ ఆసక్తి కర అంశాలను వెల్లడించారు.

కాంగ్రెస్ కు కలిసొచ్చేలా : పార్ధదాస్ ఈ మేరకు ట్వీట్ చేసారు. అందులో సత్తా మార్కెట్ తెలంగాణలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనేది వెల్లడించిందని తెలిపారు. కాంగ్రెస్ 55-57 సీట్లు..అదే విధంగా బీఆర్ఎస్ 55-57 సీట్లు సాధిస్తుందని పేర్కొన్నట్లుగా పార్ధదాస్ వివరించారు. దీనికి కొనసాగింపుగా తమ పరిశీలనలోనూ తెలంగాణలో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాధిస్తుందని స్పష్టం చేసారు. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ కు 70 సీట్లు ఖాయమని ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఈ సమయంలోనే పలు సర్వే సంస్థలు సైతం కాంగ్రెస్ కే అనుకూల వాతావరణం ఉందని రిపోర్టులు ఇస్తున్నాయి. గతం కంటే భిన్నంగా తెలంగాణలో వాతావరణం ఉందని..దీనికి అనకూలంగా మలచుకోవటంలో కాంగ్రెస్ సఫలం అవుతోందని సర్వే ఏజెన్సీలు స్పష్టం చేస్తున్నాయి.
1st time in the Satta Market, Congress is ahead in #TelanganaElections2023 . As per the Satta Market, Congress is going to win 55 to 57 seats and BRS is going to win 53 to 55 seats in the upcoming Telangana Election. Congress is gaining momentum. In our survey, we also find the… pic.twitter.com/lOxX9u38n3
— Partha Das (@partha2019LS) November 20, 2023
కాంగ్రెస్ అనుకూలంగా సర్వేలు : ఇప్పుడు తెలంగాణలో నేరుగా కాంగ్రెస్ అగ్ర నేతలు మోహరించారు. అభ్యర్దుల ఎంపిక మొదలు ప్రచారం వరకు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆరు గ్యారంటీలతో పాటుగా మేనిఫెస్టో హామీలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టటంలో సూచనలు చేస్తున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేతలు తమ మధ్యకు వచ్చి చెబుతున్న అంశాల పైన ప్రజల్లోనూ ఆదరణ కనిపిస్తోందని చెబుతున్నారు. దీంతో, కేసీఆర్ గతంలో ఇచ్చి అమలు చేయని హామీలను గుర్తు చేస్తున్నారు. తాము అధికారంలోకి రావటం ద్వారా జరిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. ఈ సమయంలో నే సెఫాలజిస్టులు..సర్వే ఏజెన్సీలు కాంగ్రెస్ కు అనుకూలంగా వెల్లడిస్తున్న అంచనాలు పార్టీ లో మరింత జోష్ పెంచుతున్నాయి.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications