సికింద్రాబాద్‌లో సైకో హల్‌చల్, ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా సైకో హల్‌చల్ సృష్టించాడు. దీంతో ఆ చుట్టుపక్కల వారంతా భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో బల్వీందర్ సింగ్ అనే వ్యక్తి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా వీరంగం సృష్టించాడు.

పెద్ద పెద్దగా అరుస్తూ, హోటల్‌ నుంచి వేడివేడి చాయ్‌ తీసుకొచ్చి మీద పోస్తానంటూ అక్కడున్న వారిని బెదిరించాడు. దీంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన ఇద్దరు కానిస్టేబుళ్లు బల్వీందర్‌‌ను పట్టుకునేందుకు యత్నించారు.

ఈ క్రమంలో బల్వీందర్‌ ఒక కానిస్టేబుల్‌ను గాయపరిచాడు. దీంతో స్థానికులు కూడా కలగజేసుకుని సైకోను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

Psycho Hulchul in Secunderabad on Monday

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య:

ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని నిజాంపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన సుధీర్ ప్రేమ విఫలమై సోమవారం తెల్లవారుజామున కిటికికి ఉరి వేసుకుని అత్మహత్య చేసుకున్నాడు.

ఆదివారం రాత్రి స్నేహితులతో కలిసి పార్టీ కూడా చేసుకున్నాడు. బీటెక్ చదివిన సుధీర్ ఉద్యోగ అన్వేషణలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+