సైకో లవర్: పెళ్లికి నిరాకరించిందని యువతిని కత్తితో పొడిచాడు
జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమిస్తున్నాంటూ వెంటపడిన ఓ యువకుడు.. పెళ్లికి నిరాకరించిందని యువతిని కత్తితో పొడిచాడు. తీవ్రగాయాలపాలైన యువతి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
జగిత్యాల: జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమిస్తున్నాంటూ వెంటపడిన ఓ యువకుడు.. పెళ్లికి నిరాకరించిందని యువతిని కత్తితో పొడిచాడు. తీవ్రగాయాలపాలైన యువతి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. తిమ్మాపూర్‌కి చెందిన యువతి (17), అదే గ్రామానికి చెందిన కొడిపెల్లి రాకేశ్ (21) మూడేళ్లుగా స్నేహంగా ఉంటున్నారు.

కొంతకాలంగా యువతి మరొకరితో మాట్లాడుతూ..తనను దూరం పెడుతోందని భావించిన రాకేశ్ ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఆదివారం మధ్యాహ్నం పొలం వద్ద ఉన్న యువతిపై కత్తితో కడుపులో పొడిచి పరారయ్యాడు.
యువతి జగిత్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. రాకేశ్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు జగిత్యాల డీఎస్పీ కరుణాకర్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications