హైదరాబాద్‌లో ఇంటి ఓనర్ రేప్ చేశాడు: వీడియో పెట్టిన పుణే టెక్కీ

హైదరాబాద్: హైదరాబాదులో తనను తన ఇంటి యజమాని లైంగికంగా వేధించాడని పుణేకు చెందిన ఓ టెక్కీ ఆరోపించారు. 25 ఏళ్ల వయస్సు గల ఆ టెక్కీ సామాజిక అనుసంధాన వేదికలో ఇందుకు సంబంధించి ఓ వీడియోను పోస్ట్ చేశారు.

తనను తన ఇంటి యజమాని వేధించారని, పెళ్లి చేసుకుంటానని చెప్పాడని ఆరోపించారు. తాను పెళ్లి ప్రతిపాదనను వ్యతిరేకించానని, దీంతో శృంగారం కోసం వేధించాడని ఆవేదన వ్యక్తం చేశారు.

తాను పుణేలో పీజీ పూర్తి చేశానని, ఓ సాఫ్టువేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పారు. తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తే అంతగా పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు.

Pune techie alleges rape

తాను తొలుత ఉన్న ఇంటిలో పూర్తి సదుపాయాలు కల్పించకపోవడంతో మరో ఇంటికి మారినట్లు చెప్పారు. తాను నాలుగు నెలల అద్దె ముందస్తుగా చెల్లించానని చెప్పారు. తాను మొదటి అంతస్తులో ఉన్నానని చెప్పారు.

కొన్ని రోజుల తర్వాత అతను వచ్చాడని, తనకు డ్రగ్స్ ఇచ్చి, అభ్యంతరకర ఫోటోలు తీసుకున్నాడని ఆరోపించారు. ఆ తర్వాత తనను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభఇంచారని ఆరోపించారు. తనను సెక్స్ కోసం బలవంతం చేశాడన్నారు.

అతను తనను పెళ్లి చేసుకుంటానని కూడా వేధించాడని, కానీ తాను తిరస్కరించానని చెప్పారు. అతను తనను బలవంతం చేస్తే చాలాసార్లు ప్రతిఘటించనని కానీ తప్పించుకోలేకపోయానని చెప్పారు. అతనికి తాను ఎన్నోసార్లు అన్నం తెప్పించి పెట్టానని, కానీ అతను నా పైన రేప్ చేశాడని ఆమె పేర్కొన్నారు. దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు అందలేదని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+