కాచిగూడలో రైలెక్కిన అమ్మోరు

కాచిగూడ రైల్వే స్టేషన్ ఓ అరుదైన ఘట్టానికి వేదికగా నిలిచింది. ఈ స్టేషన్ నుండి దుర్గామాత విగ్రహాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో రైలులో తరలించడం ప్రయాణికులను ఆకట్టుకుంది. కాచిగూడ నుంచి అశోకాపురానికి వెళ్లే 12785 నంబర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో అమ్మవారిని అనంతపురానికి తరలించారు. ఆ సమయంలో సింహవాహిణి రూపంలో ఉన్న దుర్గమ్మ విగ్రహాన్ని ప్లాట్‌ఫామ్‌పై కనిపించింది. ఇది.. భక్తి తరంగాలను నింపింది.

రైలు కాచిగూడ నుంచి బయలుదేరే ముందు ప్లాట్‌ఫామ్‌పై ఈ భక్తిపూరక వాతావరణం నెలకొంది. రైలెక్కడానికి సిద్ధంగా ఉన్న ప్రయాణికులు, స్టేషన్‌ సిబ్బంది, భక్తులు దేవీ నవరాత్రుల శోభను గుర్తుచేసుకున్నారు. ఈ ఎక్స్ ప్రెస్ లగేజ్ కమ్ బ్రేక్ వ్యాన్ లో దుర్గాదేవి విగ్రహాన్ని జాగ్రత్తగా ఎక్కించారు. అనంతపురానికి పంపారు. అనంతపురానికి చెందిన భక్తులు అక్కడ దుర్గమ్మ అమ్మవారి మంటపాన్ని ఏర్పాటు చేశారు.

Pure Bliss and Unforgettable Devotion at Kachiguda Railway Station Maa Durga Passes took Train ride

దీనికోసం హైదరాబాద్ లో విగ్రహాన్ని కొనుగోలు చేసి, రోడ్డు మార్గంలో కాకుండా రైలు ద్వారా దీన్ని గమ్యస్థానానికి చేర్చాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా విగ్రహాన్ని కాచిగూడ స్టేషన్ ప్లాట్ ఫామ్ పైకి తెచ్చినప్పుడు కనిపించిందీ అరుదైన దృశ్యం. అప్పటివరకు ప్రయాణికులతో రద్దీగా ఉన్న కాచిగూడ ప్లాట్‌ఫామ్.. అమ్మవారి ఆగమనంతో ఒక్కసారిగా భక్తి కోలాహలంతో నిండిపోయింది. రైలు కదిలే సమయంలో ప్రయాణికులు భక్తిపూరకంగా జయజయధ్వానాలు చేశారు.

రష్యాపై ట్రంప్ నిర్ణయానికి చెక్: కదులుతున్న పావులు: త్వరలో.. !!
రష్యాపై ట్రంప్ నిర్ణయానికి చెక్: కదులుతున్న పావులు: త్వరలో.. !!

దీనికి సంబంధించిన ఫొటోలను దక్షిణ మధ్య రైల్వే అధికారులు తమ అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఇది నెటిజన్ల దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. భారతీయ రైల్వేలు.. రవాణా సాధనాలు మాత్రమే కాదని, దేశంలోని వైవిధ్యమైన సంస్కృతి, సాంప్రదాయాలు, భక్తి భావాలను అనుసంధానించే జీవనాడి అనే నానుడి ఈ తాజా ఉదంతంతో మరొకసారి నిరూపితమైంది. రోజువారీ ప్రయాణాల్లో ఉన్న సామాన్య ప్రయాణికులకు కూడా అనూహ్యంగా లభించిన ఈ దైవ దర్శనం ఎనలేని ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదించింది.

సౌదీపై విరుచుకుపడుతున్న హౌతీలు: రియాద్ ఎయిర్‌పోర్ట్ పై భీకర దాడి: 12 మందికి పైగా మృతి
సౌదీపై విరుచుకుపడుతున్న హౌతీలు: రియాద్ ఎయిర్‌పోర్ట్ పై భీకర దాడి: 12 మందికి పైగా మృతి

ఇదివరకు గణేషుడి విగ్రహాన్ని కూడా ఇదే కాచిగూడ- అశోకాపురం ఎక్స్ ప్రెస్ లో అనంతపురానికి తరలించిన విషయం తెలిసిందే. కాచిగూడ నుంచి బయలుదేరి ఏపీ మీదుగా అశోకాపురానికి వెళ్తుందీ రైలు. ప్రతి రోజూ సాయంత్రం 7:05 నిమిషాలకు బయలుదేరే నవంబర్ 12785 ఎక్స్ ప్రెస్ మరుసటి రోజు ఉదయం 9:50 నిమిషాలకు అశోకాపురానికి చేరుకుంటుంది.

ఈ సాయంత్రమే తిరుమలలో ప్రధాన ఘట్టం: రేపటి నుంచి నవాహ్నిక ఉత్సవాలు
ఈ సాయంత్రమే తిరుమలలో ప్రధాన ఘట్టం: రేపటి నుంచి నవాహ్నిక ఉత్సవాలు

జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, అనంతపురం, ధర్మవరం, పెనుకొండ, హిందూపురం, గౌరీ బిదనూరు, దొడ్డబల్లాపూర్, యలహంక, బెంగళూరు ఈస్ట్, బెంగళూరు కంటోన్మెంట్, బెంగళూరు సెంట్రల్, కెంగేరి, రామనగర, మండ్య, మైసూర్ మీదుగా రాకపోకలు సాగిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+