డ్రగ్‌కేస్: 10 గంటలు ఏమైంది, పూరీకి 45 ప్రశ్నలు, వారితోనే ఫోన్లో మాట్లాడుతా!
:కుటుంబ సభ్యులు, సిని పరిశ్రమకు చెందినవారితో ఫోన్‌లో మాట్లాడుతానని టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఎక్సైజ్ పోలీసుల విచారణలో చెప్పినట్టు సమాచారం. ఇతర ఫోన్‌కాల్స్‌ను తన మేనేజర్లు లిఫ్ట్ చేస్తారని ఆయన చె
హైదరాబాద్:కుటుంబ సభ్యులు, సిని పరిశ్రమకు చెందినవారితో ఫోన్‌లో మాట్లాడుతానని టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఎక్సైజ్ పోలీసుల విచారణలో చెప్పినట్టు సమాచారం. ఇతర ఫోన్‌కాల్స్‌ను తన మేనేజర్లు లిఫ్ట్ చేస్తారని ఆయన చెప్పారు. సుదీర్ఘంగా ఎక్సైజ్ పోలీసుల విచారణను ఎదుర్కొన్న పూరీ జగన్నాథ్ పలు అంశాలకు సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది.అయితే విచారణ పూర్తైన తర్వాత తనకు కెల్విన్ ఎవరో తెలియదని పూరీ జగన్నాథ్ ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకొంది.
టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను ఎక్సైజ్ పోలీసులు పదిగంటలపాటు విచారణ చేశారు. ఈ విచారణలో పూరీ జగన్నాథ్ కీలకమైన సమాచారాన్ని అందించారని ఎక్సైజ్ పోలీసులు అభిప్రాయపడ్డారు.
మరోవైపు కెల్విన్ ఎవరో తనకు తెలియదని, తాను తప్పుడు పనులు చేసేవాడిని కాదని పూరీ జగన్నాథ్ ట్వీట్ చేశారు. సిట్ అధికారుల విచారణకు సహకరిస్తానని ప్రకటించారు.
డ్రగ్స్ ముఠా నాయకుడు కెల్విన్‌తో సంబంధాలపైనే ఎక్సైజ్ పోలీసులు ప్రధానంగా కేంద్రీకరించారు. ఈ విషయమై ఆయనను ఆరాతీసినట్టు తెలుస్తోంది.కెల్విన్, జీశాన్‌తో సంబంధాలపై ఆరాతీశారని సమాచారం.












Click it and Unblock the Notifications