కాళేశ్వరం పుష్కరాలకు వెళ్లొద్దామా..? బడ్జెట్ ధరకే ముక్తేశ్వరుడి దర్శనం, రామప్ప టూర్..

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ఒకటి. ఇక్కడ అంతర్వాహిని సరస్వతీ నది అంత్య పుష్కరాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ పుష్కరాలను నిర్వహిస్తారు. ఈ అంత్య పుష్కరాలు 12 రోజుల పాటు అంటే మే 21 నుంచి జూన్ 1 వరకు కొనసాగుతాయి. 12 రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే ఈ పుష్కరాల్లో దాదాపు 20 నుంచి 30 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసింది రాష్ట్ర ప్రభుత్వం. పుష్కరాల నిర్వహణ, ఘాట్ల అభివృద్ధి, భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం రూ. 30.63 కోట్లను మంజూరు చేసిన విషయం తెలిసిందే.

అయితే మీరు కూడా కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలకు వెళ్లాలని అనుకుంటున్నారా..? భక్తుల కోసం తెలంగాణ టూరిజం కార్పొరేషన్ అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. హైదరాబాద్ నుంచి కాళేశ్వరానికి ప్రత్యేక ఏసీ బస్సుల ద్వారా కాళేశ్వరం ప్యాకేజీ టూర్లను అధికారికంగా ప్రకటించింది. ఈ టూర్ లో భాగంగా యూనెస్కో గుర్తింపు పొందిన చారిత్రాత్మక రామప్ప ఆలయాన్ని కూడా సందర్శించొచ్చు. ఈ మేరకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ రెండు రకాల ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఏసీ హైటెక్ స్లీపర్ కోచ్ 30 సీట్లు పెద్దలకు టికెట్ ధర రూ. 3,600.. పిల్లలకు రూ. 2,880 గా నిర్ణయించారు. ఇక ఏసీ మినీ కోచ్ 21 సీట్లు పెద్దలకైతే రూ. 2800 కాగా పిల్లలకు రూ. 2,240 గా ధర ఉంది. టూర్ వివరాలు చూస్తే ముందుగా మొదటిరోజు రాత్రి 8 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ లోని బషీర్ బాగ్ గల సీఆర్వోఓ ఆఫీస్ నుంచి ప్రత్యేక ఏసీ బస్సు స్టార్ట్ అవుతుంది. రెండోరోజు ఉదయం 5 గంటలకు కాళేశ్వరం చేరుకుంటారు. అక్కడ ప్రాణహిత, గోదావరి నదుల సంగమ క్షేత్రంలో పవిత్ర పుష్కర స్నానాలు ఆచరించవచ్చు.

Pushkaram Holy Dip Budget Trip Kaleshwara Mukteshwara Blessings Ramappa Temple Affordable Package

ఆ తర్వాత యమధర్మరాజు శాపవిమోచనం పొందిన క్షేత్రంగా పేరొందిన శ్రీ ముక్తేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. కాళేశ్వరంలో భోజన విరామం ముగించుకుని బస్సు పాలంపేటలోని రామప్ప గుడికి బయల్దేరుతుంది. అక్కడ కాకతీయుల అద్భుతమైన కళాశిల్పాన్ని వీక్షించవచ్చు. రామప్ప ఆలయం సందర్శనం తర్వాత హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం ఉంటుంది. అలా రాత్రి 10 గంటలకు నగరానికి చేరుకుంటారు. అయితే పరిమిత సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్న తరుణంలో భక్తులు ముందస్తుగా టికెట్స్ బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+