అరుదైన గౌరవం: సీఆర్పీఎఫ్ హానరరీ కమాండెంట్‌గా సింధు!
న్యూఢిల్లీ : రియో ఒలింపిక్స్ 2016లో రజత పతక విజేత పీవీ సింధుకు మరో అరుదైన గౌరవం లభించింది. సింధును బ్రాండ్ అంబాసిడర్, గౌరవ కమాండెంట్‌గా నియమించాలని సీఆర్పీఎఫ్ నిర్ణయం తీసుకుంది.
కేంద్రమంత్రి ముందు సీఆర్పీఎఫ్ అధికారులు ఈ మేరకు తమ నిర్ణయాన్ని కేంద్ర హోంమంత్రి ముందు ఉంచారు. ఆయన ఆమోదం లభించిన వెంటనే సీఆర్ఫీఎఫ్ సింధును బ్రాండ్ అంబాసిడర్, గౌరవ కమాండెంట్‌గా నియమించనుంది.

ఈ మేరకు సమాచారాన్ని సింధుకు కూడా చేరవేసినట్లు సమాచారం. సీఆర్పీఎఫ్ కమాండెంట్ ర్యాంకు అంటే సాధారణంగా ఎస్పీ స్థాయి అధికారాలుంటాయి. ఒక వేళ ఫీల్డ్ ఆపరేషన్స్ కోసం వెళితే.. కమాండెంట్ కింద 1000మంది భద్రతా దళాలు పని చేస్తాయి.
ప్రస్తుతం నక్సల్ వ్యతిరేక ఆపరేషన్స్‌లో పాల్గొంటున్న సీఆర్పీఎఫ్ దళాలు.. అవసరమైనప్పుడు దేశంలోని ఇతర ప్రాంతాల్లో భద్రతా చర్యలను కూడా చేపడతాయి. అయితే, సింధు మాత్రం విరామం దొరికినప్పుడు సీఆర్ఫీఎఫ్ బలగాలు ప్రేరణ పూర్వకమైన కార్యక్రమాల్లో పాల్గొని, వారికి సందేశాలను ఇవ్వాల్సి ఉంటుంది.
ఇది ఇలా ఉండగా, రెండ్రోజుల క్రితం సింధు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications