గివ్ ఇట్ అప్: మొన్న జ్వాలా గుత్తా, నిన్న పీవీ సింధు(ఫోటోలు)
హైదరాబాద్: నిరుపేదల కోసం సంపన్న వర్గాలు గ్యాస్ సబ్సిడీని వదులుకొవాలని ప్రముఖ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అన్నారు. దేశవ్యాప్తంగా నిరుపేదల కళ్లలో వెలుగులు నింపేందుకు ప్రధాని నరేంద్రమోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఎల్‌పీజీ గ్యాస్ సబ్సిడీ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
బుధవారం మాదాపూర్‌లోని హైటెక్ సిటీ స్పైనల్ రోడ్డులో ఉన్న భారత్ పెట్రోలియం బంక్‌లో 'గివ్ ఇట్ అప్' ప్రచార కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పీవీ సింధు తనకు లభించిన గ్యాస్ సబ్సిడీని జీడిమెట్లకు చెందిన సుప్రియ అనే మహిళకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికే 12లక్షల మంది ధనికులు సబ్సిడీ నగదును తిరిగిచ్చారని ఆమె తెలిపారు. కార్యక్రమంలో భారత్‌పెట్రోలియం మాదాపూర్ డీజీఎం దేవయాని, సుందర్‌రాజన్ తదితరులు పాల్గొన్నారు. మంగళవారు ఆర్ధిక స్ధోమత ఉన్న వారు గ్యాస్ సబ్సిడీని వదులుకోవాలని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా పిలుపునిచ్చారు.
ఇందులో భాగంగా లంగర్ హౌజ్ పెట్రోల్ పంపు వద్ద మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జ్వాలా గుత్తా తన సబ్సిడీని వదులుకుని అర్హురాలైన రేణకకు అందజేసిన సంగతి తెలిసిందే.

గివ్ ఇట్ అప్: పీవీ సింధు
నిరుపేదల కోసం సంపన్న వర్గాలు గ్యాస్ సబ్సిడీని వదులుకొవాలని ప్రముఖ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవి సింధు అన్నారు.

గివ్ ఇట్ అప్: పీవీ సింధు
దేశవ్యాప్తంగా నిరుపేదల కళ్లలో వెలుగులు నింపేందుకు ప్రధాని నరేంద్రమోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఎల్‌పీజీ గ్యాస్ సబ్సిడీ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

గివ్ ఇట్ అప్: పీవీ సింధు
బుధవారం మాదాపూర్‌లోని హైటెక్ సిటీ స్పైనల్ రోడ్డులో ఉన్న భారత్ పెట్రోలియం బంక్‌లో 'గివ్ ఇట్ అప్' ప్రచార కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

గివ్ ఇట్ అప్: పీవీ సింధు
పీవి సింధు తనకు లభించిన గ్యాస్ సబ్సిడీని జీడిమెట్లకు చెందిన సుప్రియ అనే మహిళకు అందజేశారు.

గివ్ ఇట్ అప్: పీవీ సింధు
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికే 12లక్షల మంది ధనికులు సబ్సిడీ నగదును తిరిగిచ్చారని ఆమె తెలిపారు. కార్యక్రమంలో భారత్‌పెట్రోలియం మాదాపూర్ డీజీఎం దేవయాని, సుందర్‌రాజన్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications