Viral Video: ఎల్లారెడ్డిపేటలో కొండ చిలువ హల్ చల్..
ఈ మధ్య కాలంలో అడవిలో ఉండాల్సిన కొండ చెలువలు జనావాసంలోకి వస్తున్నాయి. కొద్ది రోజులు క్రితం కరీంనగర్ నగరంలో కొండ చెలువ హల్ చల్ చేసింది.
కరీంనగర్ నగరంలోని మంకమ్మతోటలోని ఓ ఇంట్లోకి కొండ చెలువ వచ్చింది. అర్ధరాత్రి వంట గదిలో నుంచి సౌండ్ రావడంతో ఇంట్లో వారు నిద్ర లేచారు. వంట గది దర్వాజ తెరవగానే.. రిఫ్రిజిరేటర్ పై కొండ చెలువ కనిపించింది. దీంతో వారంతా షాకయ్యారు.
వంట గదిలో అది తిరుగుతున్న క్రమంలో వంట సామాగ్రి కింద పడి చప్పుడు వచ్చింది. మొదటి పిల్లి అని భావించిన కుటుంబ సభ్యులు పడుకున్నారు. అయినా సౌండ్ రావడంతో వెళ్లి చూడగా కొండ చిలువ కనిపించింది. దీంతో భయపడిన కుటుంబ సభ్యులు వెంటనే పాములు పట్టేవారికి సమాచారం ఇచ్చారు. పాములు పట్టే వారు వచ్చి కొండ చిలువను పట్టి అడవిలో విడిచి పెట్టారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా కొండ చెలువ ఓ ఇంట్లోకి ప్రవేశించింది. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలో ఉన్న గంట కుశయ్య గౌడ్ ఇంట్లోకి మంగళవారం ఉదయం కొండ చెలువ వచ్చింది.

కొండ చిలువను గమనించిన కుటుంబ సభ్యలు భయబ్రాంతులకు గురయ్యారు. అయితే కొండ చెలువ ఇంట్లో ఓ మూలన పాత సామాన్లో నక్కి ఉంది. అయితే కుశయ్య గౌడ్ వెంటనే పాములు పట్టే వ్యక్తికి ఫోన్ చేసి రామ్మన్నారు. పాములు పట్టే వ్యక్తి వచ్చి కొండ చిలువను బయటకు లాగాడు. అయితే అక్కడే కోపంతో ఉన్న గ్రామస్థులు పామును కట్టెలు, రాళ్లతో కొట్టి అంతమొందించారు. అయితే కొండ చిలువను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే పాములను చంపొద్దని.. వాటిని పట్టుకుని అడవిలో వదలి పెట్టాలని పలువురు కోరుతున్నారు.
ఇంట్లో మూలకు నక్కిన కొండచిలువ..
— Mr. Mohan (@kundenapally_12) November 12, 2024
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బైపాస్
కుశయ్య గౌడ్ ఇంట్లో మంగళవారం ఉదయాన్నే కొండచిలువ కలకలం pic.twitter.com/X90Kkd7SU0
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications