నయీంతో సంబంధాలున్నాయి, నేను సీఎం కావాలనుకున్నాడు, బెదిరించా!: ఆర్ కృష్ణయ్య సంచలనం
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీంతో తనకు సంబంధాలు ఉండేవని, అయితే అవి ఆర్థికపరమైనవి కావని, రాడికల్ యూనియన్‌లో పని చేసినప్పుడు సంబంధాలు ఉండేవని, తాను ముఖ్యమంత్రి కావాలని నయీం కోరుకునే వాడని ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ఓ టీవీ ఛానల్ ఇంటర్వూలో శుక్రవారం అన్నారు.
ప్రభుత్వం చర్యను సమర్థిస్తున్నా
నయీం అరాచకాలు చేశారని, కాబట్టి ప్రభుత్వ చర్యను తాను సమర్థిస్తున్నానని చెప్పారు. అయితే దీని పైన సమగ్ర విచారణ జరపాలన్నారు. నయీం కేసులో తన పైన ప్రభుత్వం బురద జల్లుతుందని చెప్పారు. తనకు సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) నోటీసులు ఇస్తే తాను సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
నోటీసులు ఇస్తే వెళ్తా
తనకు నోటీసులు ఇస్తే కచ్చితంగా మాట్లాడుతానని చెప్పారు. సిట్ దర్యాఫ్తులో పారదర్శకత లేదని, దీనిని సీబీఐకి అప్పగించాలన్నారు. రాజకీయ దురుద్దేశ్యంతో తనను టార్గెట్ చేస్తున్నారన్నారు. తాను ముఖ్యమంత్రి పదవి కోసం నయీంతో కలిసినట్లుగా చెప్పడం సరికాదన్నారు.

సీఎం స్థాయి వ్యక్తి నాలాంటి నిజాయితీపరుడిపైన సరికాదు
తాను తన వాళ్ల కోసం పని చేస్తున్నానని, ముఖ్యమంత్రి పదవి కోసం కాదని అభిప్రాయపడ్డారు. ఎల్పీ నగర్‌లో పోటీ చేసిన సమయంలో తనకు నయీం డబ్బులు పెట్టారన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి.. తనలాంటి నిజాయితీపరులైన వారిని టార్గెట్ చేయడం విడ్డూరమన్నారు.
నయీంతో తనకు ఆర్థికపరమైన సంబంధాలు ఉన్నట్లు సిట్ నిరూపిస్తే తాను చట్టపరమైన శిక్షకు సిద్ధమన్నారు. తనకు మాత్రం ఆర్థికపరమైన సంబంధాలు లేవని చెప్పారు. నయీం వ్యవహారంలో అధికార పార్టీ నేతలే 99 శాతం మంది ఉన్నారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నయీంతో సంబంధాలు కలిగిన వారిలో ఉన్నారన్నారు.
నయీంను బెదిరించా
తన వద్దకు రోజుకు బాధల్లో ఉన్నవారు చాలామంది వస్తారని, వారి తరఫున తాను ఎలాంటి డబ్బులు తీసుకోకుండా పని చేస్తానని చెప్పానన్నారు. అలాగే నయీం బాధితులు కూడా కొందరు తన వద్ద గోడును వెళ్లబోసుకున్నారని, వారి తరఫున నయీంకు ఫోన్ చేసి తిట్టానని చెప్పారు.
లొంగిపోవాలనుకున్నాడు
నయీం మరో ముగ్గురితో కలిసి లొంగిపోవాలనుకున్నాడని, ఈ విషయాన్ని తమకు చెబితే, లొంగిపోయినప్పుడు చూద్దామని చెప్పానన్నారు. నయీం చేసే దురాఘతాలు తమకు అంతగా తెలియవన్నారు. తాను సీఎం కావాలన్నది నయీం కల అన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో నయీం తనకు సీఎం పదవి మిస్ అయిందని, తనలాంటి బడుగుల నేత సీఎం కావాలని అతను కోరుకునేవాడన్నారు. తనలాంటి వాళ్లకు రాజ్యాధికారం కోరుకునేవాడన్నారు.
తాను గతంలో భువనగిరి ఉర్సు, వినాయక ఉత్సవాలలో పాల్గొన్నానని చెప్పారు. ఉద్యమం సమయంలోనే నయీంతో సంబంధాలు ఉన్నాయన్నారు. కొద్ది నెలల క్రితం అతనితో మాట్లాడానని, అతనిని కలవక చాలా రోజులు అవుతోందన్నారు. అయితే, గత సంబంధాలను దృష్టిలో పెట్టుకొని తమను టార్గెట్ చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.
బ్లాక్ మెయిల్
నయీంతో 1986 నుంచి మంచి సంబంధాలున్నాయని చెప్పారు. పటోళ్ల గోవర్ధన్ రెడ్డితోను సంబంధాలు ఉండేవన్నారు. నయీం రాసుకున్న డైరీని బయట పెట్టాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. నయీం ఆర్థిక వ్యవహారల్లో తనకు సంబంధముంటే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. తన గెలుపు, ప్రచారం వెనుక నయీం లేరన్నారు.
తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నేతలను బెదిరించి లొంగదీసుకున్నారని, కానీ తనలాంటి నిజాయితీపరుడ్ని ఏం చేయలేరన్నారు. ప్రభుత్వం బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపితే తనవంటి బడుగు నేతలే తప్ప పెద్ద తలలు బయటకు రావాలన్నారు. సీబీఐతో లేదంటే సుప్రీం న్యాయమూర్తితో విచారణ జరిపించాలన్నారు.
నయీం తెలిసినంత మాత్రాన, ఆతనితో పాత పరిచయం ఉన్నంత మాత్రాన తనను అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. నయీం తనకు తెలుసు కానీ, అతని ఆర్థిక అంశాలతో తనకు సంబంధం లేదన్నారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో తన అరెస్చట్ వార్త తప్పదని వచ్చిన వార్తలను ఆయన ప్రస్తావిస్తూ.. వార్త రాసిన విలేకరిని కూడా విచారణ కమిటీలో నియమించి నిజానిజాలను వెలుగులోకి తీసుకు రావాలన్నారు.
నయీం తన శిష్యుడు అని, తాను చెబితే వింటాడాని చాలామంది బాధితులు వచ్చేవారని, తాను స్వయంగా ఫోన్ చేయకపోయినా, ఆ తర్వాత ఫోన్ చేయించమని చెప్పేవాడనని, అతను ఫోన్ చేస్తే అలా వద్దని హెచ్చరించేవాడినని చెప్పారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications