పత్రికల ఫైట్! సర్కార్ మీదేగా విచారణ జరపండి: రాధాకృష్ణ వర్సెస్ కెసిఆర్
హైదారాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రెండు పత్రికల మధ్య 'వార్తల' యుద్ధం సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ఇస్తుంటే, అందుకు కౌంటర్‌గా నమస్తే తెలంగాణ పత్రిక విరాళాల అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చింది.
ఇటీవల సిబిఐ తెలంగాణ సిఎం కెసిఆర్‌ను విచారించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి ఆంధ్రజ్యోతి పత్రిక... కెసిఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారని చెబుతూ వరుస కథనాలు ప్రచురిస్తోంది.
ఆంధ్రజ్యోతి కథనం పైన టిఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ పైన ఘాటైన పదజాలం ఉపయోగిస్తూ తిట్టిపోశారు. కెసిఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారని ఆంధ్రజ్యోతి కథనాలు రాస్తోంది.

దీంతో కెసిఆర్‌కు చెందిన నమస్తే తెలంగాణ పత్రిక వీణా - వాణిల అంశాన్ని తెరపైకి తెచ్చింది. వీరికి ఆపరేషన్ అంటూ అడ్డగోలుగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ డబ్బులు వసూలు చేశారని, పిల్లల ఉురు తగులుతుందని పేర్కొంది.
దీనిపై ఆంధ్రజ్యోతి కూడా ధీటుగా స్పందించింది. వీణ - వాణిల డబ్బుల విషయంలో నమస్తే తెలంగాణ పత్రిక కారుకూతలు కూస్తోందని, సర్కార్ కెసిఆర్‌దే ఉందని, దమ్ముంటే విరాళాల విషయంలో విచారణ జరిపించాలని సవాల్ చేసింది.












Click it and Unblock the Notifications