బ్లూ ఫిల్మ్ తీసి బెదిరించేవాడు, మహిళలే రఘునందన్ టార్గెట్, ఎఫ్ఐఆర్ కూడా మార్చాడు: రాధారమణి

బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావుతో తనకు ప్రాణహాని ఉందని రాధారమణి చెప్పారు. తనకు, తన కుమారుడిని చంపేస్తామని బెదిరిస్తున్నారని వాపోయింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. రఘునందన్ రావు చేసిన అరాచకాలను మీడియాకు పూసగుచ్చినట్టు వివరించారు.

భత్యం అడిగితే..

భత్యం అడిగితే..

హైదరాబాద్ ఆర్సీపురంలో రాధారమణి దంపతులు ఉంటున్నారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే భర్తతో విభేదాలు రావడంతో 2003లో ఇంటినుంచి బయటకొచ్చారు. అయితే భృతి ఇప్పించేందుకు 2007లో స్థానిక అడ్వకేట్ రఘునందన్‌ను ఆశ్రయించారు. అలా ఓ సారి ఆఫీసుకు వెళ్లిన రాధారమణికి కాఫీలో మత్తుమందు కలిపి లైంగికదాడి చేశారని ఆరోపించారు. అంతేకాదు ఆశ్లీల ఫోటోలు ఉన్నాయని చెప్పి.. ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడని రాధారమణి వివరించారు.

హెచ్ఆర్సీని..

హెచ్ఆర్సీని..

అలా చెప్పినట్టు చేసుకుంటూ వచ్చానని పేర్కొన్నది. వేధింపులు తాళలేక మానవ హక్కుల కమిషన్‌ను సంప్రదించానని తెలిపారు. వారి సూచన మేరకు ఆర్సీ పురం పీఎస్‌లో ఫిర్యాదు చేశానని వివరించారు. తనకు న్యాయం చేయాలని సీపీ సజ్జనార్‌ని కలిసి రాధారమణి కోరిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కేసు విత్ డ్రా చేసుకోవాలని తనను బెదిరిస్తున్నారని రాధారమణి వాపోయింది. తనను రఘునందన్ కిడ్నాప్ కూడా చేశాడని, ఇందుకు తన భర్త కూడా సహకరిచాడని ఆరోపించారు.

అవసరాన్ని క్యాష్ చేసుకొని..

అవసరాన్ని క్యాష్ చేసుకొని..

కేసుల పరిష్కారం కోసం వచ్చే మహిళలను రఘునందన్ టార్గెట్ చేస్తాడని రాధారమణి వివరించారు. భయపెట్టి లొంగదీసుకుంటారని పేర్కొన్నారు. వారితో బ్లూ ఫిల్మ్ తీసి నాయకులకు పంపిస్తూ.. బెదిరింపులకు గురిచేశాడని వాపోయారు. హీరో రవితేజ తమ్ముడికి బ్లూ ఫిల్మ్ సప్లై చేసేది కూడా రఘునందన్ అని సంచలన ఆరోపణలు చేశారు.

ఎఫ్ఐఆర్ కూడా ఛేంజ్

ఎఫ్ఐఆర్ కూడా ఛేంజ్

అంగ, అర్ధ బలం ఉన్న రఘునందన్.. ఆర్సీపురం పీఎస్‌లో తాను పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ మార్చారని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తానే కాదు తనలాంటి వాళ్లు చాలా మందిని రఘునందన్ లైంగికదాడి చేశాడని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+