ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన రాహుల్, రేవంత్ రెడ్డి (వీడియో)

హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రజలను కోరారు. మరోవైపు, కేంద్రంలోని బీజేపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. మరోసారి అధికారంలోకి వస్తే బీజేపీ రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ ఆరోపణలు గుప్పించారు.

గురువారంనాడు రాహుల్ గాంధీ మెదక్ జిల్లా నర్సాపూర్, హైదరాబాద్ నగరంలోని సరూర్‌నగర్ నిర్వహించిన జనజాతర సభల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమాల్లో రాహుల్ తోపాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. రాజ్యాంగం పరిరక్షణకు, రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని నేతలు పిలుపునిచ్చారు.

Rahul Gandhi and Revanth reddy tavels in tsrtc bus with women passengers

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన రాహుల్, రేవంత్

సరూర్‌నగర్ జన జాతర సభ అనంతరం హైదరాబాద్ సిటీ బస్సులో సందడి చేసిన రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి.. తిరుగు ప్రయాణంలో దిల్‌సుఖ్‌నగర్ వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులకు కాంగ్రెస్ పాంచ్ న్యాయ్ కరపత్రాలు అందించారు రాహుల్ గాంధీ.

తెలంగాణలో ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం గురించి మహిళలను రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన యువ న్యాయ్, కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్ గురించి ప్రయాణికులకు ఆయన వివరించారు. ఈ సందర్భంగా రాహుల్, రేవంత్‌తో ప్రయాణికులు ఫొటోలు దిగారు.

అంతకుముందు సరూర్‌నగర్ సభలో రాహుల్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీపై విమర్శల దాడికి దిగారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, ఆర్‌ఎస్సెఎస్‌ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజ్యాంగంతో పాటు రిజర్వేషన్లు కూడా రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని రాహుల్ ఆరోపించారు. రిజర్వేషన్లు రద్దు చేసేందుకే ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వరంగ సంస్థలను విక్రయించి అన్నీ ప్రైవేటుపరం చేస్తున్నారని, క్రమంగా ప్రైవేటీకరణ పెంచి రిజర్వేషన్లు రద్దు చేయాలనేది బీజేపీ ఆలోచన అని రాహుల్ ఆరోపించారు.

దేశంలో 90 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాధికారం దక్కటం లేదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. వెనుకబడిన వర్గాల ప్రజలు ఎంతమంది ఉన్నారో ముందు లెక్కలు తేలాలన్నారు. ఒకసారి జనగణన చేస్తేనే.. ఎవరు ఎంత శాతం ఉన్నారో తెలుస్తుందని రాహుల్ స్పష్టం చేశారు. దేశంలోని నిరుపేదలందరితో ఒక జాబితా రూపొందిస్తామని, రైతులు దళితులు ఆదివాసీలు, మైనార్టీలతో ఒక జాబితా రూపొందిస్తామన్నారు.

ప్రతి పేద కుటుంబం నుంచి ఒక మహిళను ఎంపిక చేసి రూ.లక్ష ఇస్తామని హామీ ఇచ్చారు. కుటుంబ ఖర్చుల కోసం ప్రతి పేద మహిళ బ్యాంకు ఖాతాలో నెలకు రూ. 8500 చొప్పున.. ఏడాదికి రూ.లక్ష డిపాజిట్‌ చేస్తామన్నారు రాహుల్. బ్యాంకు ఖాతాల్లో వేసిన డబ్బులతో మహిళలు ఎన్నో వస్తువులు కొనుగోలు చేస్తారని, మహిళల కొనుగోలు శక్తి పెరగటంతో పరిశ్రమల్లో వస్తు ఉత్పత్తి పెరుగుతుందన్నారు. ఉద్యోగా కల్పనకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని రాహుల్ ప్రజలను కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+