డెలివరీ బాయ్స్‌కు తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్..

ఎండనకా వాననకా నగర వీధుల్లో శ్రమిస్తున్న గిగ్ వర్కర్ల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. గిగ్ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమ పథకాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఘనంగా ప్రారంభించారు. జయభేరి గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో వీరు పాల్గొని గిగ్ వర్కర్స్ విధివిధానాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు శిల్పకళా వేదిక నుంచి జయభేరి గ్రౌండ్స్ వరకు గిగ్ వర్కర్లు భారీ బైక్ ర్యాలీ నిర్వహించగా, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

నెహ్రూ జయంతి కానుకగా రూ.15 లక్షల భద్రత: సీఎం రేవంత్ రెడ్డి

సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గిగ్ వర్కర్ల కష్టానికి తగిన చట్టబద్ధమైన ఆదాయం, గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి చట్టపరమైన రక్షణ కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని తీసుకొచ్చామని తెలిపారు. గతంలో గిగ్ వర్కర్లకు న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు, ఆయన చేతులమీదుగానే ఈ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నెహ్రూ జయంతి సందర్భంగా గిగ్ వర్కర్లకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల జీవిత బీమా, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల ఆరోగ్య భద్రత కల్పిస్తామని ప్రకటించారు. త్వరలోనే ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులు అందజేస్తామని సీఎం హామీ ఇచ్చారు.

Rahul Gandhi and Revanth Reddy Unveil Gig Workers Policy in Hyderabad With Welfare Board and Rest Houses
దేశవ్యాప్త సమ్మె.. రంగంలోకి 1.2 కోట్ల మంది కార్మికులు!
దేశవ్యాప్త సమ్మె.. రంగంలోకి 1.2 కోట్ల మంది కార్మికులు!

శ్రమ మీది.. సమాచారం మీ దగ్గర లేదు: రాహుల్ గాంధీ

ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన ప్రసంగంలో గిగ్ వర్కర్ల కష్టాలను ప్రస్తావిస్తూ, వారి బాధ తనకు తెలుసని భరోసా ఇచ్చారు. ఇప్పటివరకు దేశంలో గిగ్ వర్కర్లకు సంబంధించిన సరైన డేటా లేదని, డెలివరీ సమయం, వచ్చే ఆదాయంపై స్పష్టత లేకుండా శ్రమ దోపిడీ జరుగుతోందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి డెలివరీపై పారదర్శకత తీసుకొస్తోందని, ప్రతి డెలివరీ, రవాణాపై వచ్చే 1 శాతం వాటా గిగ్ వర్కర్ల బోర్డు ద్వారా నేరుగా వారి ఖాతాల్లోకే చేరుతుందని వివరించారు. ఎండల్లో తిరిగే వర్కర్ల కోసం హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో ప్రభుత్వం రెస్ట్ హౌస్‌లు ఏర్పాటు చేసిందని తెలిపారు.

'భారత్ సమ్మిట్' లో గిగ్ వర్కర్స్ పాలసీ ఆవిష్కరణకు రాహుల్ గాంధీ: సీఎం రేవంత్ రెడ్డి
'భారత్ సమ్మిట్' లో గిగ్ వర్కర్స్ పాలసీ ఆవిష్కరణకు రాహుల్ గాంధీ: సీఎం రేవంత్ రెడ్డి

రెండు సిద్ధాంతాల మధ్య పోరాటం..

దేశంలో ప్రస్తుతం రెండు రకాల ఆలోచనా విధానాలు నడుస్తున్నాయని రాహుల్ గాంధీ విమర్శించారు. ఒకటి కార్మికుల శ్రమను 24 గంటలు దోచుకుని అదానీ, అంబానీలకు కట్టబెట్టే ఆర్ఎస్ఎస్, బీజేపీ విధానమని ఆయన ఆరోపించారు. రెండోది గిగ్ వర్కర్లను దేశ నిర్మాణంలో భాగస్వాములుగా గుర్తించి, వారికి పెన్షన్, బీమా, పిల్లల చదువులకు అండగా నిలిచే కాంగ్రెస్ విధానమని పేర్కొన్నారు. ప్రధాని మోదీ విధానాలు కార్మికులకు ఏమీ దక్కకుండా చేస్తున్నాయని విమర్శించిన ఆయన, తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్ల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+