బీఆర్ఎస్‌తో పొత్తుపై తేల్చేసిన రాహుల్ గాంధీ.. రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్!!
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీతో పొత్తుపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి ఢిల్లీకి వెళుతున్న సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న రాహుల్ గాంధీతో కాంగ్రెస్ పార్టీ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర రాజకీయాలపై కాంగ్రెస్ నేతలతో అరగంట పాటు చర్చించారు.
కర్ణాటక ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ సమయం కేటాయిస్తానని, తెలంగాణ పై ఫోకస్ చేస్తానని టీ కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తో పొత్తు పై స్పందించిన రాహుల్ గాంధీ నేడు తెలంగాణ ప్రాంత నేతలతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉండబోదని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఇక ఇదే విషయాన్ని ప్రజలకు వివరించాలని పేర్కొన్న ఆయన బిజెపి చేసే ప్రయత్నాలను తిప్పి కొట్టాలన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్ దొరికింది. బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు ఉందనే అంశాన్ని బిజెపి ప్రజా క్షేత్రంలో ప్రచారం చేస్తూ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తుందని రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతలకు తెలిపారు. దీనికి చెక్ పెట్టడానికి తాము బిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోబోమని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎం ప్రభావం గురించి పార్టీ నేతలతో చర్చించిన రాహుల్ గాంధీ ఈ ఏడాది చివర్లో జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అందుకే కర్ణాటక ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణ పై ఫోకస్ చేస్తానని వెల్లడించారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని, వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ శ్రేణులు ఒక్క తాటిపై పని చేయాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications