Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణా ఓటర్లకు రాహుల్ గాంధీ ఆసక్తికర సందేశం.. గోపూజలు చేసి ఓటేసిన రేవంత్ రెడ్డి!!

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు తమ తమ నియోజకవర్గాలలో, తమ ఓటు హక్కు ఉన్న పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. క్యూలైన్లో నిలబడి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఓటును వేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో చాలామంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఇక తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెద్ద సంఖ్యలో ఓటింగ్ వేయాలని, ఓటింగ్ శాతాన్ని ఎక్కువగా నమోదు చేయాలని తెలంగాణ ఓటర్లకు విజ్ఞప్తి చేయగా, తాజాగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు ఆసక్తికర సందేశాన్ని ఇచ్చారు. ఆయన తెలుగులోనే ట్వీట్ చేశారు.

Rahul Gandhi interesting tweet to the voters of Telangana.. Revanth Reddy did gopuja and voted!!

నేడు దొరలపై ప్రజలు గెలవబోతున్నారు అంటూ పేర్కొన్న రాహుల్ గాంధీ, నా తెలంగాణ సోదరీ సోదరీమణులారా.. అధిక సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనండి అంటూ పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు ఓటేయాలని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా ఓటర్లకు సూచించారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేసినప్పుడు ప్రజల నుంచి వచ్చిన ఆదరణకు సంబంధించిన ఒక వీడియోను రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇదిలా ఉంటే టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొడంగల్లో జెడ్‌పీహెచ్‌ఎస్ బాయ్స్ సౌత్ వింగ్ పోలింగ్ బూత్ లో రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఓటు వేయడానికి వెళ్లడానికి ముందు రేవంత్ రెడ్డి కొడంగల్ నివాసంలో గోపూజ కార్యక్రమంలో సతీసమేతంగా పాల్గొన్నారు.

ఆపై తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాట్లాడిన రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు సమయస్ఫూర్తి ఉన్నవారని, తెలంగాణ రాష్ట్రంలో అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం కావాలంటే ప్రజలకు ఆమోదయోగ్యమైన ప్రభుత్వం రావాలని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ఏర్పాటు చేసే ప్రభుత్వంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎలాంటి కుట్రలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+