(పిక్చర్స్) మహాత్ముడికి-రోహిత్‌కూ రాహుల్ గాంధీ లింక్, వెంకయ్య ఆగ్రహం

హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్ ఘటన కుదిపేస్తోంది. ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ దీక్షలో కూర్చోగా, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఘాటుగా స్పందించారు. రోహిత్ ఆత్మహత్యను రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల్లో దళితులు, దళిత వ్యతిరేకులన్న పిచ్చి భావన తొలగిపోవాలని వెంకయ్య సోమవారం అన్నారు. ఉదయం హైదరాబాద్, బంజారాహిల్స్‌లో జరిగిన ఉత్తర భారతీయ మంచ్‌లో ఆయన మాట్లాడారు. బాధాకరమైన ఘటనను రాజకీయం చేయాలని చూస్తున్నారన్నారు.

రాహుల్ గాంధీ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని నిప్పులు చెరిగారు. వీరి రాజకీయాలతో రోహిత్ ఆత్మ రోధిస్తోందన్నారు. సమాజంలో మానసిక పరివర్తన తీసుకురావడానికి అందరూ సహకరించాలని కోరారు. కంటి ముందు కనిపిస్తున్న అభివృద్ధి, పనిచేసిన, చేస్తున్న ప్రభుత్వాలపై విశ్వాసం ఉంచాలని అన్నారు.

తెలుగు నేలపై అభివృద్ధికి కళ్లకు కట్టిన ఎన్టీఆర్ ఇప్పటికీ అందరి గుండెల్లో ఉన్నారన్నారు. హైదరాబాద్‌లో గృహ నిర్మాణ పథకం కింద 29 వేల ఇళ్లను కేంద్రం కేటాయించిందన్నారు. హైదరాబాద్‌లో ఎవరూ సెటిలర్లు కాదని, అంతా భారతీయులేనన్నారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల పట్ల సానుభూతిని చూపే వారే బీజేపీపై విమర్శలు చేస్తున్నారని వెంకయ్య విమర్శించారు.

కాగా, ఆదివారం నాడు రాహుల్ గాంధీ హెచ్‌సియులో దీక్ష చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహాత్మా గాంధీలాగే రోహిత్‌కూ అవమానం జరిగిందన్నారు. నిజం చెప్పే స్వేచ్ఛను, హక్కును హరిస్తున్నారని బిజెపిపై మండిపడ్డారు. విశ్వవిద్యాలయాల్లో వివక్ష ఉందన్నారు. నిర్మూలించేందుకు ప్రధాని మోడీ చట్టం తేవాలన్నారు.

 రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీ మాదిరిగానే హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్‌కు అవమానం జరిగిందని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు.

రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

హెచ్‌సీయూలో జరిగిన ఘటన భవిష్యత్తులో జరగకుండా పోరాడతామన్నారు. ఆత్మహత్య చేసుకున్న రోహిత్‌ పుట్టినరోజు సందర్భంగా విశ్వవిద్యాలయంలో జరిగిన మహాదీక్ష ముగింపులో రాహుల్‌ ఉద్వేగంగా మాట్లాడారు.

రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

సత్యాన్వేషణకు నిరంతరం కృషి చేసిన గాంధీజీ దక్షిణాఫ్రికాలో అనేక అవమానాలు ఎదుర్కొన్నారని, అయినా మొక్కవోని దీక్షతో ముందుకు నడిచారని, ఆయన సత్యం చెప్పడం భరించలేని కొన్ని శక్తులు మహాత్ముణ్ని తుపాకీ గుళ్లకు బలి చేశాయన్నారు.

 రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

గాంధీజీ వర్ధంతి రోజునే పుట్టిన రోహిత్‌ విషయంలోనూ ఇదే జరిగిందని, రోహిత్‌ ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశారని, అతను చూసింది చెప్పనివ్వలేదని, మనసులో ఉన్నదాన్ని మాట్లాడనివ్వలేదని, సత్యాన్ని నినదించే హక్కును, సొంతంగా ఆలోచించే హక్కును అణగదొక్కారని రాహుల్ గాంధీ అన్నారు.

 రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

తీవ్రమైన ఒత్తిడి తెచ్చి బలవన్మరణానికి ప్రేరేపించారని, ఎంతో మంచి విద్యార్థిని కోల్పోయామని, రోహిత్‌ కుటుంబానికీ అన్యాయం జరిగిందన్నారు. ఈ సమస్య ఒక్క విద్యార్థిది మాత్రమే కాదని, దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో రోహిత్‌ లాంటివారు ఉన్నారన్నారు.

 రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

ఇలాంటి అవమానం దేశంలో ఎవరికైనా జరగొచ్చునని, విశ్వవిద్యాలయాల్లో, కళాశాలల్లో వివక్ష తీవ్రంగా ఉందని. దళితులు, గిరిజనులు, కులం, మతం, మహిళలు.. ఇలా అన్ని వర్గాలూ వివక్షను ఎదుర్కొంటున్నాయని రాహుల్ గాంధీ అన్నారు.

 రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకూడదని, కులవివక్షకు వ్యతిరేకంగా చట్టం తీసుకురావాలని, దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆరెస్సెస్ ఒకే భావజాలాన్ని రుద్దుతున్నారని, విద్యార్థులపైనా అదే భావజాలాన్ని రుద్దుతున్నారని, ఈ ధోరణి సరికాదన్నారు.

 రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

విశ్వవిద్యాలయాల్లో వివక్షతో దేశం అభివృద్ధి చెందదని, విద్యార్థులకు హోదాను, గౌరవాన్ని పాటించాలని, వివక్షకు వ్యతిరేకంగా ప్రధాని మోడీ చట్టం తీసుకురావాలని, లేకపోతే విద్యార్థులు దాన్ని సాధిస్తారని, దీనిపై దేశంలో ప్రతి విద్యార్థీ స్పందించాలన్నారు.

 ఏఎస్ఎస్ఎఫ్

ఏఎస్ఎస్ఎఫ్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటిలో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్ ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించిన ఏఐఎస్ఎఫ్ నాయకులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+